గుడి, బడికి తేడా లేకపోతే ఎలా?
ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం దర్పం దెయ్యమై పట్టింది కాబోలు.. అందుకే బరితెగింపుకు, దౌర్జన్యాలకు వెనుకాడడంలేదు!! నాడు బళ్లల్లో విద్యాకమిటీ నియామకాల్లో రాజకీయాలు.. నేడు గుళ్లల్లో ఎమ్మెల్యే సిఫార్సుల పేరుతో పెత్తనాలు! ఇదేక్కడ దౌర్భగ్యమోకానీ.. అధికార వైసీపీకి ప్రజారంజకపాలన కన్నా.. అధిపత్యం, పేరు కోసం ప్రజాకంఠక పాలన వైపే అధిక ప్రేమ!! అందుకేనెమో ఆలయాల్లో కూడా వారిమాట, వారి సిఫార్సులే నెగ్గాలంటూ చెత్త రాజకీయాలకు తెరతీస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిన్న శివరాత్రి రోజు స్థానిక ఎమ్మెల్యే బియ్యం మధుసూధన రెడ్డి, ఆయన కుమార్తె చేసిన హడవుడి అంతాఇంతా కాదు. కరోనా వీడిన మూడేళ్ల తరువాత వచ్చి మహాశివరాత్రి.. అందులో శివ దర్శనం ఎంతో ఎంతో శుభప్రదమని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఏపీలోని అన్ని శైవక్షేత్రాలకు తండోపతండాలు భక్తులు తరలివచ్చారు. ఇదే అదునుగా శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే సిఫార్సుల రాజకీయానికి తెరదీశారు. ఈ నేపథ్యంలో శివరాత్రికి శ్రీకాళహస్తేశ్వరస్వామి దర్శన భాగ్యం కావాలంటే.. శివయ్య దర్శనానికి ముందు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కుమార్తె పవిత్రరెడ్డిని దర్శించుకోవాలని క్లారిటీ అయితే అందరికీ ఇచ్చారు. వీరి సిఫార్సులుంటే శ్రీకాలహస్తేశ్వరుడి, శ్రీ జ్ఞానప్రసునాంబిక దర్శనాలు లేకుండే గంటల తరబడి క్యూలైన్స్ లో వేచిచూడాల్సిందే అన్నట్లుగా నిన్న ఆలయంలో పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో పాటు స్వామి వారి దర్శనానికి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే అనుచరుల సిఫార్సులు ఆదనంగా తోడయ్యాయి. దీంతో సామాన్య భక్తుల స్వామి దర్శనం క్యూలైన్స్ లో ప్రత్యక్ష నరకం చవి చూశారు. గంటలకొద్ది క్యూలైన్స్ నిలిపివేసి, వీఐపీ సేవలో అధికారులు మునిగి తేలారు.
ఎమ్మెల్యే ఆధీనంలో ఆలయం!
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.. వివాదాలు కేఆరాఫ్. జగన్ రెడ్డి భజన బృందంలో అగ్రగణ్యుడు. నియోజకవర్గంలో ఈయనగారికి కనుసన్నల్లోనే అన్ని జరగాలన్నదే ప్రధాన డిమాండ్. అయితే చివరికి ఆలయాల్లో కూడా ఎమ్మెల్యే పెత్తనమే సాగాలంటారు. అయితే గుళ్లో దేవుళ్ల దర్శనాలకు మీ పెత్తనం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిన్న శివరాత్రి నాడు శ్రీకాళహస్తేశ్వరుడిని, జ్ఞాన ప్రసునాంబిక అమ్మవారిని దర్శించాలంటే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి సిఫార్సు తప్పనిసరి అన్నట్లుగా మారింది. ప్రతిఒక్కరూ ఎమ్మెల్యే సిఫార్సులు పట్టుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దీంతో సామాన్య భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే, ఆయన కుమార్తె దెగ్గరుండి మరి విఐపీలకు దర్శనాలు కల్పించారని భక్తులు మండిపడుతున్నారు. భక్తులు పిల్లలతో క్యూ లైన్స్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు లేక, ఉక్కపోతలతో శివయ్య దర్శనం అతి కష్టమీద చేసుకున్నారు! అధికారం చేతులో ఉందికదా.. అని ప్రజలను నిర్లక్ష్యం చేస్తే తగిన ఫలితం అనుభవించక తప్పదని స్థానికులు సైతం మండిపడుతున్నారు. గుళ్లలో ఈ స్థాయిలో రాజకీయాలు చేయడం వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read:-జగన్ ప్రభుత్వానికి టీచర్స్ జేఏసీ స్ట్రాంగ్ వార్నింగ్! 75 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఓడిస్తాం!