నేచురల్ స్టార్ నానీ.. ఎర్లియర్ గా కొన్ని సినిమాలతో పరాజయాల్ని చవిచూశాడు. అందుకే తదుపరి చిత్రాల విషయంలో మరింత కేర్ఫుల్ గా అడుగులేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో కొన్ని స్పెషల్ కాంబోస్ ను సెటె చేసుకున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ ‘టక్ జగదీష్’, రాహుల్ సాంకృత్యాయన్ ‘శ్యామ్ సింగరాయ్’ మూవీస్ ను ట్రాక్ లో పెట్టిన నానీ.. తాజాగా మరో వెరైటీ మూవీకి శ్రీకారం చుట్టాడు. సినిమా పేరు ‘అంటే.. సుందరానికీ’. ‘మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు.
నానీ 28వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన కర్టెన్ రైజర్ ను చిత్రయూనిట్ ఈ రోజు విడుదల చేసి.. దాంతో పాటు సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. చాలా ఆసక్తికరంగా సాగిన ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హర్షవర్ధన్, సుహాస్ ఏదో రహస్యం గురించి గుసగుసలాడుకుంటున్నట్టు చూపించి.. టైటిల్ ను రివీల్ చేయడం ఆకట్టుకుంది. టైటిల్ లోగోలో నానీ పల్లెటూరి వాడిలా పంచెకట్టుకొని ఒక బ్యాగ్ పట్టుకొని అటు తిరిగి నుంచున్నాడు. 2021 లో ఈ ఫన్ ను ఎంజాయ్ చేయొచ్చని కర్టెన్ రైజర్ లో తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Must Read ;- అవసరాల దర్శకత్వంలో నేచురల్ స్టార్ సినిమా..?











