‘అష్టాచెమ్మా’ సినిమాతోనే నానీ, అవసరాల శ్రీనివాస్ ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో నానీ హీరోగా కంటిన్యూ అయి.. ఇప్పుడు నేచురల్ స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ మాత్రం ఇటు నటుడిగానూ, అటు దర్శకుడిగానూ సమానంగా మార్కులేయించుకున్నాడు. డైరెక్ట్ చేసిన తొలి రెండు చిత్రాలూ మంచి సక్సెస్ సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకున్నాయి. ప్రస్తుతం అవసరాల .. నాగశౌర్య హీరోగా ‘పలానా అమ్మాయి పలానా అబ్బాయి’ అనే వెరైటీ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అవసరాల నానీ తో ఒక సినిమా తెరకెక్కించే ప్రయత్నాంలో ఉన్నాడని టాక్.
నానీ , అవసరాల ఇంత వరకూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ అవసరాల దర్శకత్వంలో నానీ నటించనేలేదు. ఆలోటు కూడా ఈ సినిమాతోనే తీరనుందని టాక్. ప్రస్తుతం నానీ వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో వీరిద్దరి మధ్యా కథా చర్చ నడిచిందట. అవసరాల కథ నానీకి ఎంతగానో నచ్చి.. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. మరి సెన్సిబుల్ దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల నానీని ఏ తరహాలో పాత్రలో చూపించబోతున్నాడో .. వెయిట్ అండ్ సీ.











