‘అంజలి అంజలి అంజలి.. ’ పాటలో పున్నమి జాబిలిలా మెరిసిన అర్హ మెరిసిపోయింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మన పెద్దలు ఊరికే అనలేదేమో. సూపర్ స్టార్ మహేష్ ముద్దుల పట్టి సితార డ్యాన్సుల్లో ఇరగదీస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఆమెకు మరో పోటీ అల్లు అర్హ. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ కూడా ఎందులోనూ తీసిపోలేదు.
ఈరోజు ఆమె పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆమెకు ఓ అపురూపమైన కానుకను అందజేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. అర్హకు ఈరోజుతో నాలుగేళ్లు నిండి ఐదో ఏట అడుగుపెట్టింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులను ప్రజల్లోకి తీసుకు రావడానికి ఇష్టపడరు. ఇప్పుడా పరిస్థితి మారింది. ముఖ్యంగా వీరి పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
అల్లు అర్జున్ కు అర్హ, అయాన్ సంతానం. వీరు డ్యాన్స్ ల్లోనూ చురుకుగా ఉంటారు. చాలా కాలంగా వీరు చేసిన డ్యాన్స్ లు, ఇతర సందిడి వీడియాలను ఏర్చి కూర్చి అల్లు అర్జున్ ఓ అద్భుతం చేశారు. అదేమిటంటే అంజలి సినిమాలోని పాటతో వాటిని మిక్స్ చేసి వదిలారు. అర్హాస్ అంజలి పేరుతో యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ వీడియో ఈరోజు విడుదల చేస్తే 3 లక్షల వ్యూస్ కు చేరువైంది. ఈ వీడియోకి బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షల జోరు కూడా పెరుగుతోంది.
Must Read ;- బన్నీ కోసం ‘వరుడు’ విలన్ రంగంలోకి దిగుతున్నాడు