టాలీవుడ్ లో ‘ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్’ లాంటి సినిమాల్లో మాత్రమే నటించిన .. గ్లామరస్ గాళ్ పాయల్ ఘోష్ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ‘పటేల్ కీ పంజాబీ షాదీ’ అనే బాలీవుడ్ మూవీలో మాత్రమే కనిపించిన పాయల్ ఘోష్ పేరు.. ఈ మధ్యకాలంలో ఒక విషయంలో మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. మీటూలో భాగంగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ 2003 లో ముంబై లో తనపై లైంగికంగా దాడి చేశాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది పాయల్ ఘోష్ . ఆమె ఆరోపణల్ని అనురాగ్ కశ్యప్ కొట్టిపడేశాడు. ఆ టైమ్ లో తాను శ్రీలంకలో షూటింగ్ లో ఉన్నానని చెప్పాడు.
ఆ మేటర్ లోకి తనను ఇరికించినందుకు రిచా చద్దా అనే బ్యూటీ.. పాయల్ మీద కేసు పెట్టిందనుకోండి.. అది వేరే విషయం. అసలు మేటర్లోకొస్తే.. ఈ పరిస్థితుల్లో తాను రాజకీయ పరంగా బలపడితే.. మంచిదని ఆ బ్యూటీకి అనిపించిందో ఏమోగానీ.. పాయల్ సడెన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలేకి చెందిన ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరారు. అథవాలే సమక్షంలో మరికొందరితో కలసి పాయల్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం పాయల్ ను పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పాయల్ చేరికతో పార్టీ బలపడుతుందని అథవాలే చెప్పారు. అంతేకాదు త్వరలోనే కశ్యప్ అరెస్ట్ అవుతారని కూడా చెప్పారు.











