(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో మహిమ గల చెంబు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాలోని ఐదుగురు సభ్యులలో నలుగురిని అరెస్టు చేసి, వారి నుండి రూ.3 లక్షలు నగదు, 3 బైకులు, 4 సెల్ ఫోన్లు, మహిమ గల చెంబుగా నమ్మించి మోసగిస్తున్న రాగి చెంబును నెల్లిమర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి గురువారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్. మంగవేణి, ఎస్ఐలు పాల్గొన్నారు
Must Read ;- లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌పై ఉద్యోగుల దాడి