హాలీవుడ్ లో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ మామూలిది కాదు. అలాంటి క్రేజ్ ను విడుదల కాకుండానే సంపాదించుకున్న ఫ్రెంచ్ సినిమా ‘ది స్వార్మ్’. ఫ్రెంచ్ డైరెక్టర్ జస్ట్ ఫిలిప్పోట్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చలన చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసాలు పొందింది. అంగౌలోమ్ ఫ్రాంకోఫోన్ ఫెస్టివల్‌లో గత ఆగస్టులో ఈ సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసించారు. ఈ సినిమా ప్రపంచ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. మిడతల దండుతో ఓ మహిళకు ఏర్పడిన బంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ పాత్రను ఫ్రెంచ్ నటి సులియాన్ బ్రహిమ్ పోషించింది. పంట పొలాలను నాశనం చేసే మిడతలను చూశాం. రక్తమాంసాల రుచి మరిగిన మిడతను ఇందులో చూస్తామన్న మాట.
కేన్స్ చిత్రోత్సవంలో ఈ సినిమాని ప్రదర్శించాల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ ఉత్సవం రద్దయింది. డిసెంబరు 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రసారాలు ప్రారంభమవుతాయి. వైల్డ్ బంచ్ ఇంటర్నేషనల్ తో ఈ సినిమాకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్, స్పెయిన్, చైనా మినహా మిగతా అన్ని దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని చూడవచ్చు. ఈ నెల 18న స్పియిన్ లోని సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. నవంబరు 4న ఫ్రాన్స్ లో ఈ సినిమా విడుదలవుతుంది. మరి మిడతలతో ఈ దర్శకుడు ఎలాంటి ప్రయత్నం చేశాడో మనం నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాక చూడాల్సిందే.