బాలీవుడ్ బ్యూటిఫుల్ గాళ్ సనా ఖాన్ గుర్తుందా? అదేనండీ.. ‘కళ్యాణ్ రామ్ కత్తి’, నాగార్జున ‘గగనం’, మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ లాంటి సినిమాల్లో గ్లామరస్ ట్రీట్ ఇచ్చిన చిన్నది. అమ్మడు బాలీవుడ్ జనానికి కూడా ఓ రేంజ్ లో అందాల విందు చేసింది. సల్మాన్ ఖాన్ బిగ్ ‘బాస్ 6 లోనూ’, ‘జైహో’ సినిమాలోనూ చక్కగా పెర్ఫార్మ్ చేసిన ఆ సుందరి ఆఖరు గా నటించిన సినిమా అక్షయ్ కుమార్ ‘టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ’.
దీని తర్వాత సనా ఖాన్ తనకు సంబంధించిన అన్ని అందాల ఎవిడెన్సుల్ని అంటే.. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోస్ , వీడియోల్ని డిలీట్ చేసేసి మరీ తన రిటైర్ మెంట్ ను ప్రకటించింది. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచి.. అభిమానులకు షాకిచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు పేరు, పలుకుబడి, సంపద అన్నీ ఇచ్చిందని, అయితే కొంతకాలంగా నిజంగా మనిషికి కావాల్సింది పేరు, సంపదనే నా? ఇంకేమీ లేవా? అని తనకు అనిపించిందని. అందుకే ఈ రోజు నుంచి తన సినీ జీవితానికి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నానని సనా ఖాన్ అందరికీ షాకిచ్చింది. ఇకపై తను మానవ సేవ చేసుకుంటూ.. ఆ దేవుడి ఆర్డర్స్ ను ఫాలో అవుతానని చెప్పింది.
My happiest moment😊
May Allah help me n guide me in this journey.
Aap sab mujhe dua Mai Shamil rakhe🤲🏻#sanakhan #2020 #8thoct #thursday pic.twitter.com/8DIJJ2lCSC— Saiyad Sana Khan (@sanaak21) October 8, 2020











