ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 చికిత్స, నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే భారత్ చేపట్టిన పరీక్షల్లో కొత్త ఆశాకిరణం వెలుగుచూసింది. అత్యంత అధికంగా శుద్ధి చేసిన యాంటీ సిరాను మన దేశీయ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంస్థ హైదరాబాద్`కు చెందిన బయలాజికల్ ఇ.లిమిటెడ్ సహకారంతో ఈ పరీక్షలు చేసింది. ఈ పద్ధతి అత్యంత సమర్ధవంతమైనదని, స్థిరమైన ఫలితాలను సాధించగలదని ఐసీఎంఆర్ వెల్లడించింది. యాంటీసిరా పద్ధతిలో రేబిస్, హెపటైటిస్-బి, టెటనస్, బొటులిసమ్, డిఫ్తీరియా.. వంటి వైరల్, బాక్టీరియా వ్యాధులకు చికిత్స చేసినట్లు స్పష్టం చేసింది.
నిన్నటి వరకు కొవిడ్-19 నివారణకు ప్లాస్మా చికిత్సను తిరుగులేనిదిగా భావిస్తూ వచ్చారు. అయితే కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి నుండి తీసుకునే ప్లాస్మా బాధితులకు అందించడంలో స్థిరమైన ఫలితాలు రావడం లేదు. అందువల్ల ప్లాస్మా చికిత్స మీద పూర్తిగా ఆధారపడలేమని కేసులు వెల్లడిస్తున్న నేపథ్యంలో యాంటీసిరా పద్ధతి కొవిడ్ పై పోరుకు ఆశాకిరణంలా కనిపిస్తోంది.
బొత్స టీమ్ టీడీపీలోకి జంప్.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును...











