ఏపీలో వరద బాధితుల కోసం ప్రముఖులు అందరూ తలా ఓ చెయ్యి వేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోలు రూ.కోట్ల కొద్దీ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు. రాజకీయ ప్రముఖులు కూడా తమవంతు సాయం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అయితే, రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకంగా రూ.6 కోట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. వీరే కాక ప్రముఖ మీడియా సంస్థలు కూడా సాయం చేయడంలో ముందుంటున్నాయి. ఈనాడు సంస్థ ఏకంగా రూ.5 కోట్ల విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ప్రకటించింది.
ప్రముఖుల్లో రెండు చిరంజీవి రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ప్రభాస్ రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, మహేశ్‌బాబు రూ.కోటి, ఎన్టీఆర్ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.20 లక్షల విరాళం ఇస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షల విరాళం ప్రకటించారు.
అయితే, ఈనాడు సంస్థ రూ.5 కోట్ల విరాళం ప్రకటించగా.. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ఒకటిగా చెప్పుకునే జగన్ కరపత్రిక సాక్షి మాత్రం ఇంత వరకూ ఏ విరాళాన్ని ప్రకటించలేదు. ఇప్పుడే కాదు.. గతంలోనూ విపత్తుల సమయంలో ఏ సాయాన్ని సాక్షి నుంచి రాలేదు. సాక్షి బాధ్యతలు చూస్తున్న భారతి ఇంత వరకూ ఏ విరాళాన్ని ప్రకటించేదు.
పైగా జగన్ పెద్ద వ్యాపార వేత్త కూడా. మీడియా వ్యాపారాలే కాక, సిమెంటు ఫ్యా్క్టరీలు, గ్రానైటు ఫ్యాక్టరీలు సహా దిగ్గజ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు జగన్ కు ఉన్నాయి. పెద్ద వ్యాపార వేత్త అయిన జగన్ కూడా ఇంత వరకూ ఏ సాయాన్ని ప్రకటించలేదు. పైగా వైఎస్ఆర్ సీపీ కూడా విరాళం ప్రకటించినట్లు లేదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి మోసపూరిత పరామర్శలని తేలిపోయింది. ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా పార్టీ పరంగానే కాక, ఎంతో కొంత వ్యక్తిగతంగా కూడా సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించేవారని అంటున్నారు. అంటే బురద తొక్కినట్లుగా జగన్ నటించడం అంతా నిజమే అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది.











