కోవిడ్ కారణంగా 50 శాతం ప్రేక్షకులను మాత్రమే థియేటర్లలో అనుమతించాలన్న ప్రభుత్వ నిబంధనల మేరకు వీపీఎఫ్ ఛార్జీలు మరింత భారమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి జరిపిన చర్చల ఫలితంగా కొంత ఊరట లభించినట్లయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదలయ్యే సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలు ఉండవని నిర్మాతల మండలి ప్రకటించింది. ఇక నూతన ఏడాది జనవరి నుంచి మార్చి వరకు విడుదలయ్యే సినిమాలకు డిజిటల్ చార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లించాల్సి ఉంటుందని మండలి వెల్లడించింది.
డిజిటల్ సర్వీస్ చార్జీల సస్ సెట్ క్లాజ్ నిబంధన విషయంపై మండలి చర్చలు చేపట్టిందని, కొత్త ఏడాది మార్చి 31 లోపు దీనిపై ఒప్పందం జరిగే అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలలో ఈ విషయాలపై చర్చలు జరుగుతున్నాయని, అక్కడ ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే అవి తెలుగు సినిమాలకు వర్తించగలవని ఆశిస్తున్నామని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమను పునః నిర్మించడానికి, పునః ప్రారంభించడానికి థర్డ్ పార్టీ డిజిటల్ ప్రొవైడర్లు సహకరిస్తారని భావిస్తున్నట్లు మండలి పేర్కొంది.
Must Read ;- ఐ.యమ్.డీ.బీ టాప్ 10 వెబ్ సిరీస్ 2020 లిస్ట్ ఇదే











