ఏపీ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పనిచేశారు. ఈ సమయంలో పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా జరిపిన కొనుగోళ్లలో అక్రమాలకు జరిగాయని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లడంపై ఏబీ వెంకటేశ్వరరావు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శాఖాపరమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో కూడా ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు.
15 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించారు. లేనిపక్షంలో సంబంధిత అధికారి ఎదుట హాజరై వాదన వినిపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Must Read ;- స్టీఫెన్ రవీంద్ర కోసం జగన్ మరోసారి పట్టు..











