love fai
love fai
ఓ ప్రేమ కథ విషాదాతం అయింది. ప్రేమ కథ అనడం కన్నా ప్రేమ పేరుతో చేసిన వంచన, ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ప్రణయ్ ప్రేమలో విఫలమై నైట్రోజన్ గ్యాస్ పీల్చి కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాద్ వాసి. ఇక అఖిలప్రియతో ప్రేమలో మునిగిపోయిన ప్రణయ్, ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆమె గతంలో మరో ఆరుగురితో స్నేహం చేసిందని తెలసినా ప్రణయ్ మాత్రం సీరియస్ గానే ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే అఖిలనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ అఖిల మనసులో చాలా మంది ఉన్నారు. ఆమె ఎవరెవరితో ఎంతకాలం గడిపిందో ప్రణయ్ కు చెప్పినా అతను పిచ్చిప్రేమ మానలేదు. ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆమె మద్యానికి, ధూమపానానికి బానిపైనా అఖిలనే ఇష్టపడ్డారు. ఆమెను వాటి నుంచి దూరం చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం ప్రేమిస్తున్నట్టు నటించి చివరకు మోసం చేయడంతో తట్టుకోలేని ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రేమికులకు పాఠం చెప్పిన ప్రణయ్
ప్రణయ్ కెనడాలో ఆత్మహత్యకు పాల్పడటంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణయ్ చనిపోయే ముందే అఖిల తనను ఎలా మోసం చేసిందనే విషయాలు అందరికీ తెలియాలని, ఇక ముందు ఆమె మోసానికి ఎవరూ బలికావద్దనే ఉద్దేశంతో ప్రణయ్ తయారు చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రణయ్ బతికుండగా అఖిల తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పినా వారు కూడా అఖిలనే సపోర్ట్ చేశారు. దీంతో ప్రణయ్ కు తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే చనిపోయే ముందు అఖిల తనను ఎలా మోసం చేసిందో ప్రపంచానికి తెలియాలని అతను చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి.
Also Read ;- అమృత, ప్రణయ్ ల ‘మర్డర్’పై వర్మ అన్ని మాటలేల?
ప్రేమే జీవితం కాదు
ఎవరికైనా ప్రేమే జీవితం కాదు. ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. కొందరి ప్రేమలు సఫలం అవుతాయి. మరికొందరి ప్రేమలు విఫలం అవుతాయి. అలా అని ప్రేమలో విఫలం అయిన వారంతా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు. ప్రణయ్ ఉదంతం కూడా మరోసారి నేటి తరానికి ఇదే సందేశం ఇస్తోంది. మోసం చేసిన అఖిల కెనడా నుంచి హెచ్ వన్ వీసాతో అమెరికాకు వెళ్లిపోయింది. అఖిల మోసం చేసిందని ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంటే తనకు అన్యాయం జరిగిందని, అతనే శిక్ష విధించుకున్నాడు. సహజంగా మోసం చేసిన వారిని శిక్షించాలి. కానీ ఇక్కడ బాధితుడే ఆత్మహత్యకు పాల్పడి అఖిల మోసాన్ని వెలుగులోకి తెచ్చాడు. ప్రణయ్ తను చెప్పాలనుకున్న విషయం ప్రపంచానికి చెప్పగలిగాడు, కానీ అతను మాత్రం ఈ ప్రపంచానికి దూరం అయ్యాడు.
Also Read ;- హైదరాబాద్ లో చోటుచేసుకున్న ‘హానర్ కిల్లింగ్’ ఘటన!!
ఇలాంటి వారితో జాగ్రత్త
అఖిలప్రియలాంటి మోసగత్తెలు అనేక మంది ఉంటారు. అలా అని ప్రతి ఒక్కరిని మోసగత్తె అనలేం. ఆ కోణంలో కూడా అందరినీ చూడకూడదు. అయితే ఇక్కడ అఖిల ఇప్పటికే ఆరుగురిని మోసం చేసింది. అయితే ప్రణయ్ మాత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అఖిలను గాఢంగా ప్రేమించడం కారణం కావచ్చు. లేదంటే ప్రణయ్ సున్నితమనక్కుడు అయి ఉండవచ్చు. అఖిల మోసం చేసినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విశాల ప్రపంచంలో ఎంతో మంది మంచి అమ్మాయిలున్నారు. వారిలో ఎవరో ఒకరు ప్రణయ్ తో జీవితం పంచుకునేందుకు ముందుకు వస్తారు. అఖిల మోసం చేసిందని ఆత్మహత్యకు పాల్పడితే, భవిష్యత్తులో జీవితంలో ఎన్నో సమస్యలు రావచ్చు. వాటిని ఎదుర్కునే సత్తా లేకుంటే ఈ ప్రపంచంలో బతుకు సాగించడం చాలా కష్టం. చావు పరిష్కారం కాదు. సమస్యలు శాశ్వితం కాదు. జీవితమే పోరాటం. జీవితంలో చివరి వరకు పోరాటం సాగించిన వారే విజేతలుగా నిలుస్తారు.
Also Read ;- ‘మర్డర్’ ప్రియులకు శుభవార్త.. కానీ కొన్ని కండిషన్స్!











