బెస్ట్ డైరెక్టర్ అవార్డ్‌తో చరిత్ర సృష్టించారు క్లోయ జా. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి తెల్లజాతికి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డును అందుకున్న రెండో మహిళగా క్లోయిజాను చెప్పాల్సి ఉంటుంది. ఆమె చైనాలో పుట్టింది. బ్రిటన్ లో చదువుకుని అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుంది. ఆమె దర్శకత్వం వహించిన నోమడ్ ల్యాండ్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు దీనికి దర్శకత్వం వహించిన క్లోయిజాకు కూడా అవార్డు దక్కింది. అంతేకాదు ఈ సినిమాకి ఉత్తమ నటి విభాగంలోనూ అవార్డు దక్కింది. మొత్తం మూడు అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి.
క్లోయజా ప్రత్యేకత ఏమిటి?
ఆమె సినిమాలు సినిమాటిక్ గా ఉండవు. సాధారణ ప్రజలనే నటులుగా ఎంచుకుని వైవిధ్యమైన పాత్రలకు ఆమె ప్రాణం పోస్తారని అందరూ అంటుంటారు. అలాంటి క్లోయిజా ‘నోమ్యాడ్ ల్యాండ్’లో ఎలాంటి ప్రత్యేకతలున్నాయో మరో కథనంలో తెలుసుకుందాం. ఆమె రూపొందించే తర్వాతి చిత్రం మాత్రం ఆమె ఎంచుకునే మార్గానికి భిన్నంగా ఉండబోతోందట. అదే మార్వెల్ సూపర్ హిట్ ‘ఎటర్నల్స్’.
ఆస్కార్ అవార్డు ఇంతకుముందు కేథరిన్ బిగెలోకి లభించింది. ఆ సినిమా పేరు ‘ది హర్ట్ లాకర్’. 11 ఏళ్ల తర్వాత ఈ అవార్డు మరో సారి మహిళను వరించింది. క్లోయ జా బీజింగ్‌లో జన్మించారు. దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె వయసు 39 ఏళ్లు. ఆమె తండ్రి ఉక్కు రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె మారు తల్లి సాంగ్ డాండన్ చైనాలో పేరున్న హాస్యనటి.
2021 ఆస్కార్ విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: నోమడ్‌ల్యాండ్
ఉత్తమ నటి: ఫ్రాన్సెన్ మెక్డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)
ఉత్తమ నటుడు: ఆంథొని హాప్కిన్స్ (ది ఫాదర్)
ఉత్తమ సహాయ నటి: యూ-జంగ్ యోన్ (మినారి)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలూయా (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య)
ఉత్తమ డైరెక్టర్: క్లోయీ జా (నోమడ్‌ల్యాండ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: క్రిస్టోఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ (ది ఫాదర్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: ‘సోల్’
ఉత్తమ డాక్యుమెంటరీ: పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్, క్రెయిగ్ ఫోస్టర్ (మై ఆక్టోపస్ టీచర్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ గీతం: ఫైట్ ఫర్ యూ – జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య (హెచ్‌ఇఆర్, డెర్నెస్ట్ ఎమిలీ-2, టియారా థామస్)
ఉత్తమ సంగీతం: సోల్ (ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్, జాన్ బాటిస్ట్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: మంక్ (ఎరిక్ మెసర్షిమిట్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్ (ఆండ్రూయ జాక్సన్, డేవిడ్ లీ, ఆండ్ర్యూ లాక్లీ, స్కాట్ ఫిషర్)
ఉత్తమ ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్ (మికెల్ ఇ.జి. నీల్సన్)
Must Read ;- సంచార జీవితాల్లోని ఆర్ద్రత నోమడ్ లాండ్