పొన్నూరు ఎమ్మెల్యే విధానాలు మాకు నచ్చడంలేదు..!
పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విధానాలు మాకు నచ్చడంలేదని ఒక వర్గం వారు దూరంగా ఉంటున్నారు. మమల్ని కలుపుకుపోయి ఉద్దేశ్యం ఆయన లేదని ప్రత్యక్షంగానే విమర్శించుకుంటున్నారు. ఎమ్మెల్యే వర్గం ఒకరైతే.. పార్టీ సీనియర్ వర్గంలా మరోకరుగా విడిపోయి విద్వేషాలను రెచ్చగొట్టుకుంటున్నారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ విభేదాలే సామాజిక మాధ్యమాల్లో తగువుకు దారితీశాయి. ఇరువర్గాల వారు పరస్పర పోస్టింగ్స్ తో వివాదస్పదంగా మారాయి. ఈ యుద్ధం అంతటితో ఆగకుండా క్రిమినల్ కేసు వరకు వెళ్లాయి. అధికారాన్ని అడ్డపెట్టుకుని, పోలీసులను పురికొల్పి తమపై అక్రమ కేసుల పెట్టారని ఎమ్మెల్యే వర్గంపై బాధిత వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ప్రతివాదులకు నోటిసులు జారీ చేసింది. కోర్టు నుంచి నోటీసులు అందుకున్న వారిలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పెదకాకాని పోలీసు స్టేషన్ ఎస్హెచ్వోతో పాటు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పెదకాకాని ఎస్ఐ బండారి సురేష్ బాబు ఉన్నారు. ఈ నేపధ్యంలో నోటీసులపై ఏం జవాబు ఇస్తారో వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
వివాదాలకు దారితీసిన అంశాలు..
పొన్నూరు నియోజకవర్గ పరిధిలో నాలుగు నెలలు క్రితం ‘వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గం’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో ఒక సందేశం వచ్చింది. ‘ఆయనకు ఎవరితోనూ పడదట.. ఆయన అంటే ఎవరికీ గిట్టదంట..’అనే సందేశాన్ని ఒక వ్యక్తి పోస్ట్ చేశారు. దీనిపై ఉప్పలపాడు కు చెందిన శివబత్తుని దయానందబాబు పెదకాకాని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ పొన్నూరు నియోజకవర్గం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ షేక్ ఖాదర్ బాషా పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఇతడిపై పోలీసులు ఐపీసీ 504, 504 ( 2 ), 153 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఖాదర్ బాషాతో పాటు వైసీపీకి చెందిన జమ్ముల లక్ష్మీప్రసాద్ హెకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై పోలీసు పెట్టిన కేసు అక్రమమని, దానిని కొట్టివేయాలని కోరారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో పాటు మరో నలుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇలా పొన్నూరు నియోజవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలు తారా స్థాయికి చెరుకున్నాయి. ఈ వివాదాలే ఎటువైపుకు దారితీస్తాయో అన్న చర్చ కూడా అధికారపార్టీలో ఊపందుకుంది.











