పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీ వకీల్ సాబ్ గురించి పీకే ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రోజుకి రెండు కోట్లు ఛార్జ్ చేశాడనే వార్త దగ్గర నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇలా వకీల్ సాబ్ ప్రమోషన్ మెటిరీయల్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు పీకే ఫ్యాన్స్.
అయితే కరోనా కారణంగా వకీల్ సాబ్ షూట్ ఆగిపోవడంతో పాటు ఈ మూవీ ఓటిటిల్లో విడుదల చేస్తున్నారనే వార్తలు వస్తుండటంతో పీకే ఫ్యాన్స్ లో కొంత మేర ఆందోళనకర పరిస్థితి ఉంది. దీన్ని కాస్త తగ్గించడానికి వకీల్ సాబ్ టీమ్ పీకే పుట్టినరోజుని వాడుకోబోతున్నారు.
పీకే పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి వకీల్ సాబ్ టీమ్ రెడీ అయింది. పీకే పై ఓ స్పెషల్ వీడియో రెడీ చేసి, అందులో వకీల్ సాబ్ లో ఉన్న పీకే చెప్పిన ఓ పంచ్ డైలాగ్ పెట్టి రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
వకీల్ సాబ్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అమితాబ్ హీరోగా హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి తెలుగు రీమేక్ సినిమాగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. ఇదే స్టోరీలో తమిళం స్టార్ హీరో సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. మరీ ఈ కథను పీకే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 2021 సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ విడుదల అవ్వచ్చు.