బాలీవుడ్‌ని గడగడలాడిస్తున్న నెపోటిజం సెగ టాలీవుడ్ హీరో నాగార్జునకి కూడా తగిలింది. వెండితెర పై వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న కింగ్ నాగ్ ప్రస్తుతం బుల్లితెర పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే నాగార్జున నటిస్తున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర పై నెపోటిజం ఎఫెక్ట్ పడింది.
ఆలియాభట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉండటమే అసలు కారణం. బాలీవుడ్ నెపోటిజంతో అట్టుడికిపోతున్న ఈ టైమ్ లో బ్రహ్మాస్త్ర సినిమా పరిస్థితి ఏంటన్నదే పెద్ద డౌట్ గా మారినట్లుగా బాంబే వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి సడక్ 2 ట్రైలర్ కి వచ్చిన బ్యాడ్ రెస్పాన్స్ కి ఆలియా భట్ చాలా అప్ సెట్ అయినట్లుగా తెలిసింది.
బ్రహ్మాస్త్ర సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కొన్ని సీన్స్ ఆలియాభట్ మీదనే తెరకెక్కించాలట, అయితే ఇప్పుడు ఈ బ్యూటీ షెడ్యూల్‌లో పాల్గొనే పరిస్థితి లేనన్నట్లుగా తెలపడంతో మరి కొన్నాళ్లు పాటు ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశం లేదని అంటున్నారు. దీంతో నాగార్జున పాన్ ఇండియా సినిమా ఆగిపోయిందనే కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వినిపిస్తున్నాయి.











