‘బ్రింగ్ బ్యాక్ నేతాజీ ఆషెష్’.. అంటూ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ట్విటర్ ట్యాగ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.ఇటీవల హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నేతాజీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘ఎక్కడో రెంకోజీలో ఉండిపోయినటువంటి మన భారత దేశపు వీరుడు సుభాష్ చంద్రబోస్ అస్థికలను మన దేశానికి తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు. అయితే, ఇది ఇప్పటి వరకు తాను ఎవరికీ చెప్పలేదని.. ఈ అంశంపై ఆయనొక్కరే కాదు అందరు గొంతెత్తాలని కోరుతూ ఆయన ఈ హ్యాష్ ట్యాగ్‌ను రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..పవన్ కు జాతీయ స్థాయిలో పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇక తమ అభిమాన నటుడు, నాయకడు ఇచ్చిన పిలుపుతో పవన్ అభిమానులు కూడా ఈ అంశాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...