జగన్ తన నీతిమాలిన చీకటి వ్యాపారం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడని విమర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు.ఏపీలో ఉన్నది కల్తీ ఎక్సైజ్ పాలసీ అని, అది కేవలం జగన్ కు అనుకూలంగా రూపొందించిన పాలసీ అని అన్నారు. మద్యం కంపెనీలను భయపెట్టి, బెదిరించి.. మాన్యుఫాక్చరింగ్ మొదలు డిస్ట్రిబ్యూషన్ , రిటైల్ వ్యాపారం వరకు మద్యం అమ్మకాలు తన కనుసన్నల్లో జరిగేలా జగన్ ఈ పాలసీని తీసుకొచ్చారని తెలీపారు. జగన్ ధన దాహానికి రాష్ట్రంలో అనేకమంది అనారోగ్యం పాలవుతున్నారని, మరికొందరు ఏకంగా ప్రాణాలు కొలపుతున్నారన్న ఆయన , కల్తీసారా మరణాలు వాటికి నిదర్శనమని అన్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మరణాలు జగన్ హత్యలే అన్న ఆయన.. 28 మంది కల్తీసారా తాగి చనిపోతే ప్రభుత్వం కనీసం బాధ్యత లేనట్లుగా వ్యవహరించడం పై అసహనం వ్యక్తం చేశారు.స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా కల్తీసారా మరణాలను సహజ మరణాలు అని చెప్పడం హేయమని, దాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం నాసిరకమని ఆధారాలతో సహాయ టిడిపి ముందుకు వచ్చి చర్చకు ఆహ్వానిస్తే ప్రభుత్వం భయపడి చర్చకు రాలేదని పేర్కొన్నారు. నాసిరకం మద్యం అమ్మకాల కోసం జగన్ ఓ వైపు సమాజాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి తెచ్చారని, మరోవైపు కల్తీ మద్యం విక్రయాలతో రాష్ట్రంలోని మహిళల తాళిబొట్లను తెంచుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేదన్న చంద్రబాబు,న్యాయం జరిగే వరకు దీనిపై ఖచ్చితంగా పోరాడి తీరుతామని అన్నారు.
నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్ Vs బండ్ల గణేష్ కౌంటర్..!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...











