పొత్తు పెట్టుకోవడంలో తప్పేముంది..!
పొత్తుల విషయం పవన్ మంగళవారం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు పార్టీలతో పొత్తు కోరవచ్చునని పవన్ ఉద్ఘాటించారు. పొత్తు విషయంలో నా ఒక్కడి నిర్ణయమే కాదని.. ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తు నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాక అత్యంత వేగంగా రాష్ట్రంలో జనసేన పార్టీ నిర్మాణం జరుగుతోందని పవన్ చెప్పారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణ పనులు పూర్తి అయిన తరువాత పొత్తుల మాట మాట్లాడుకుందామని కార్యకర్తలు పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఈ క్రమంలో మొన్న కుప్పం పర్యటనల ఉన్న చంద్రబాబుతో ‘ జనసేనతో మనం పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోదాం’ అని అన్న కార్యకర్తలతో .. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు అని చంద్రబాబు బదులిచ్చారు. ఈ నేపధ్యంలో పవన్ కూడా నేడు టెలీ కాన్ఫరెన్స్ లో కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
2014 లో పొత్తులతో ప్రభంజనం..!
రాష్ట్ర విజభన జరిగి తొలిసారి విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోడి.. అద్భుత ఫలితాలను సాధించారు. తండ్రి వైఎస్ ఫోటో పట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తే చాలు.. గెలుపు మన ముంగిట ఉంటుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్ కు పొత్తుల వ్యూహం ఝలకిచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోరాగా.. ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. పొత్తులతో అధికార సాధ్యపడిన వేళా.. చంద్రబాబు ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించగానే.. బీజేపీ నుంచి ఇరువురికి కేబినేట్ లో అవకాశం కల్పించారు. ప్రచారం ఫుల్ సపోర్ట్ చేసిన పవన్ కు తగిన ప్రాధ్యానిస్తూ.. ఉత్తరాంధ్రలో పవన్ చేపట్టిన పలు ప్రజాహిత కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఇలా 2014 నాటి స్ట్రాంగ్ పొత్తు కలిస్తే.. ఏపీలో అధికారం సాధ్యపడుతోందని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేక పవనాలకు 2014 జోడి కలిస్తే.. గెలుపు హోరులో ఫ్యాన్ పార్టీ కొట్టుకుపోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, ఢిల్లీ స్థాయి పెద్దలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ దఫా పవన్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్లు కొన్ని సర్వేలు ద్వారా అందుతున్న సమాచారం!











