మోడీ, జగన్ కు ప్రజలే బుద్ది చెప్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు అందనంత ఎత్తుకు పెరిగిపోవడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. నిత్యవసర ధరలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో బెడ్లు, మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పెట్రోల్ బాదుడు వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే మోదీ, జగన్ కు ప్రజలే బుద్ది చెప్తారని ఆయన అన్నారు.
Must Read ;- ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్.. ఏడాదిలో రూ.21 పైకి..!











