ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి .. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్, సింగిల్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా ఈ నెల 13నే విడుదలయిపోవాలి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో పాటు.. విడుదల కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తయ్యాకా సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేస్తారు.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెలుగు నెటివిటీకి తగినట్టు గా స్ర్కిప్ట్ ను మార్చి.. చిరుకి సంతృప్తిని కలిగించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఇక ఇందులో ఒరిజినల్ లో లేని కథానాయిక పాత్రను చిరంజీవి కోసం ఇన్ సర్ట్ చేశారని టాక్.
ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో అతి ముఖ్యమైన అప్టేట్ ఏంటంటే.. దీనికి ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ నే ఖాయం చేయబోతున్నట్టు సమాచారం. కథను బట్టి.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లరే అయినా.. అందులో చిరంజీవి మాత్రం పొలిటీషియన్ కాదు. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేసే ‘కింగ్ మేకర్’ పాత్ర అన్నమాట. అందుకే సినిమాకి దాన్నే దాదాపు ఫైనల్ చేయబోతున్నారని వినికిడి. ఇక ఇందులో ఒక ప్రధాన పాత్రను విలక్షణ నటుడు సత్యదేవ్ చేయబోతున్నాడని ఇదివరకే వార్తలొచ్చాయి. మరి ‘కింగ్ మేకర్’ గా చిరు ఏ రేంజ్ లో మేకోవర్ అవుతారో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే: చిరంజీవి