కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతా మోహన్ మరోసారి ఏపీ సీఎం జగన్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని ఆయన అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… జడ్జీలు దయ చూపడం వల్లే జగన్ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్నారు. జగన్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని అన్నారు. వివేకానంద చనిపోయి రెండేళ్లు అవుతున్నా.. ఇంతవరకు ఛార్జీషీటు కూడా దాఖలు చేయని పరిస్థితి సీఎం జగన్‌దని ఆయన విమర్శించారు. అనంతరం బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజీల్, నిత్యవసర ధరలు బీజేపీ హాయంలోనే పెరుగుతున్నాయని, బీజేపీకి బుద్ది చెప్పాలని చింతా మోహన్ అన్నారు.
Must Read ;- గుండెల్లో పోటును గుండె పోటన్నారు.. వివేకా హత్య కేసు వెంటనే తేల్చాలన్న ఆదినారాయణరెడ్డి