దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్వకత్వ పర్యవేక్షణలో .. గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘పెళ్ళిసందD’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీలీల అనే అమ్మాయి కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మ్యూజికల్ మ్యాజిక్ చేసిన పెళ్ళి సందడి చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ , దీప్తి భట్నాగర్ జంటగా నటించిన ఆ సినిమా అప్పటి యూత్ ను భలే ఆకట్టుకుంది.
యం.యం. కీరవాణి ఒకప్పటి మ్యాజిక్ ను రీక్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి రెండు సింగిల్స్ విడుదలయ్యాయి. ఈ రెండూ యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.
ఆగస్ట్ వరకూ థియేటర్స్ తెరిచే అవకాశాలు లేవు. అందుకే దీని విడుదలకు ఓటీటీనే సరైన వేదిక అని భావిస్తున్నారట. అంతే కాదు.. దీనికి అమెజాన్ , ఆహా నుంచి అదిరిపోయే ఆఫర్స్ వచ్చాయట. రూపాయికి రూపాయి లాభం వచ్చే ఆఫరట అది. త్వరలోనే డీల్ ఓకే అవ్వొచ్చని సమాచారం. మరి రాఘవేంద్రరావు ఆ విషయం లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
.Must Read ;- సెకండ్ లిరికల్ : బుజ్జులు బుజ్జులు అంటూ పాటేసుకున్న ‘పెళ్ళిసందD’ జోడీ











