ప్రధాని మోదీ నేడు తెలంగాణ పర్యటనలో ఉన్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన ఇటు తెలంగాణ బీజేపీ నేతలు, అటు నిఘా అధికారుల నివేదిక కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తప్పుడు కేసుల్లో ఇరికించి కుట్రకు తెరతీసి చంద్రబాబును అరెస్ట్ చేయించిన వ్యవహారం ఏపీ సీఎం జగన్ ను మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన నేతగా ఎదిగి ప్రజల్లో అంతులేని ఆదరణ పొందుతున్న చంద్రబాబుకు చెక్ పెడితే తప్ప ఏపీలో బీజేపీ బలంగా ఎదగదన్న ఆలోచనతోనే జగన్ ను అడ్డుపెట్టి చంద్రబాబును కేంద్రం అరెస్ట్ చేయించిందని జనం విశ్వసనీయంగా నమ్ముతున్నారు. ఇదంతా మోడీ, అమిత్ షా డైరెక్షన్ లోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
చంద్రబాబు ఆదరణ గురించి సొంత పార్టీ నేతల నుంచి, జనసేన నుంచే గాక ఇంటలిజెన్స్ ద్వారా కూడా కేంద్రానికి సమాచారం ఉంది. అందుకే ఎన్నికలకు ముందు కేంద్రం చంద్రబాబు అరెస్ట్ కు కుట్ర చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుంటే కొన్ని సీట్లకే పరిమితమైపోవలసిందేనని, ఆంధ్రప్రదేశ్‌లో ఎదగాలంటే పొత్తుకంటే అధికార పార్టీని అడ్డుపెట్టుని అన్ని విధాలుగా లాభం పొందవచ్చని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ పథకం సారాంశమే చంద్రబాబు అరెస్ట్.
అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎప్పుడేం జరుగుతుందోనని కేంద్రం సమాచారం సేకరిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల నిరసన, మోతమోగిద్దాం, సత్యమేవ జయతే వంటి నిరసనకార్యక్రమాల వ్యవహాలపై కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన అంశాన్ని కూడా బీజేపీఢిల్లీ పెద్దలు సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పరిణామాల నడుమ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడిగి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై సమాచారం సేకరించారు. జనసేన జత కట్టిన తర్వాత ఏపీలో ఏం జరుగుతోందో కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి సమగ్రంగా వివరించారట. దీనితో పాటు హోం శాఖ నుంచి కూడా ఏపీలో తాజా రాజకీయాలపై ప్రధాని ఇంటిలిజెన్స్ నివేదికనుకోరారాట.
ఈ పరిస్థితుల మధ్య గురువారం ఢిల్లీ వెళుతున్న ఏపీ సీఎం జగన్ ముందు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులను ప్రధాని ప్రస్తావించే అవకాశముందని కూడా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ పరిస్థితి ఏమిటన్న అంశంపైనే ప్రధాని ప్రధాని ప్రస్తావించే అవకాశముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశం గురించి కూడా ప్రధాని ఆరా తీశారు. బీజేపీకి గుడ్ బై చెప్పేయాలన్న జనసేన, తెలుగుదేశం నిర్ణయం ప్రభావం ఎంత మేరకు ఉండబోతోందో కూడా ప్రధాని పలువురు స్థానిక నేతల ముందు ప్రస్తావించారట.