ఏపీలో దళితులపై దమనకాండ కొనసాగుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా.. నిలదీసినా.. కేసులు.., అరెస్ట్ లు అంటూ చట్టాల చట్రంకిందేసి తొక్కుతున్నారు.
ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ప్రాథమిక, మానవ హక్కులు కాలరాయపడు తున్నాయి. రాజ్యాంగ కల్పించిన స్వేచ్ఛ హరించబడుతోంది. కానీ ఇన్నీ జరుగుతున్నా.. పెద్దన్న పాత్ర పోషించే కేంద్రం నోరు మెదపడం లేదు. రాజకీయ అవసరాల కోసం ఏపీని కేంద్రం వద్ద ఒకరు తాకట్టుపెడితే.., మరోకరు ఢిల్లీ గద్దెపై కూర్చోని రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారు. బీజేపీ, వైసీపీ చీకటి ఒప్పందాలు.. చివరికీ చీకట్లు అలుముకున్న ఏపీ ప్రజల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి.
ఏపీలో చట్టాలు చట్టు బండలయ్యాయి. ముఖ్యంగా దళిత హక్కులు కాలరాయబడుతున్నాయి. సామాజీకంగా, రాజకీయంగా వారికి స్వేచ్ఛ లేకుండా పోతోంది. మాస్క్ అడిగి నేరానికి.., ఇసుక లారీలను ఆపిన పాపానికి.., కల్తీ మద్యాన్ని ప్రశ్నించిన వైనానికి దళితులని చూడకుండా చంపేశారు ఘటనలు కోకొల్లలు. దళితులను టార్గెట్ చేసి దాడులతో భయబ్రాంతులకు గురిచేశారు. అవే నేడు వందలు దాటుకుని దాదాపు 6 వేల మంది దళితులపై దాడులకు పురికొల్పిన్నది పచ్చి నిజమని విపక్షాలు రుజువులతో ఆరోపిస్తున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా దళిత యువకుని మరణం రాష్ట్రంలో ఆగ్రాహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. సాక్ష్యాత్తు హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో జరిగిన ఈ ఘటన యావత్తు దళిత సంఘాలను ఆలోచింపజేస్తోంది. కొవూరు మండలం దొమ్మేరులో వైసీపీ సానుభూతిపరుడైన మహేంద్ర ఫ్లెక్సీ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీ చించేసిన వివాదంలో మహేంద్రను పోలీసులు స్టేషన్ కు పిలిచి అవమానించారని మనస్తాపానికి గురై.. పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమన్నాయి. తానేటి వనిత కు వ్యతిరేకంగా దొమ్మేరులో నినాదాలు చేశారు బంధువులు. ఒక దశలో మంత్రి తానేటి కాన్వాయిపై కూడా దాడిచేసి కారు అద్దాలు పగలు కొట్టారని తెలుస్తోంది. ఇలా దళితులపై ఎన్ని అకృత్యాలు జరిగినా.. అధికార వైసీపీ దళిత నేతలు కానీ.., మంత్రులు కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించరు.
ఇదిలా ఉంటే .. దళితులపై నిత్యకృత్యమైన దాడులు…, కేసులు.., హత్యలపై స్సందించే తెలుగుదేశం, జనసేన నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది జగన్ ప్రభుత్వం. దళిత యువకుడు మహేంద్ర కు నివాళులర్పించేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సోషల్ యాక్టీవిస్ట్ మహాసేన రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి.. రాజేష్ ను కదలకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పోలీసులు వ్యవహిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు ఖండించారు. రాజ్యాంగ హక్కులను.., స్వేచ్ఛను కాలరాసే హక్కు మీకేవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.