దుబ్బాక ఎన్నికకు సమయం ఇంకా మూడు రోజులే మిగిలుంది. దీంతో అన్ని పార్టీ నేతల అక్కడ వాలిపోయి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాలను పన్నుతున్నారు. పోలింగ్‌కు ఇంకా మూడు రోజేలే సమయం ఉండటంతో పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంచే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు.
అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడం, అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం తెలిసిందే. కాగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్ధిపేట, దుబ్బాకలోని టీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లల్లో పోలీసుల సోదాలు జరిగాయి. దుబ్బాక ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, జడ్పిటీసీ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్యవైశ్య అధ్యక్షుడు చింతరాజు, సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితీ ఈ సోదాల్లో ఏమి దొరకలేదని ప్రకటించారు.
ముందే జాగ్రత్త పడ్డారా?
రఘునందన్‌రావు బంధువుల ఇళ్లల్లో జరిగిన సోదాల ఎపిసోడ్ తరువాత దుబ్బాకలో పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నడుమ ఎన్నికల సంఘంకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారికి ఎన్నికల అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారిని కావాలనే నియమించచారనే ఆరోపణలను టీఆర్ఎస్ పార్టీలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమపై ప్రతీకారం తీర్చుకునేందుకే టీఆర్ఎస్ ఇళ్లల్లో సోదాలను నిర్వహించారనే విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే రఘునంధన్‌రావుకు సంబంధించిన బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు దాదాపు రూ.18 లక్షల నగదు పట్టుబడితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఏమీ దొరకకపోవడం గమనార్హం పైగా ఆశ్చర్యం. అంటే సోదాల విషయంలో ముందే అధికార పార్టీ నాయకులకు ఉప్పందిందా? లేక ఇలాంటి పరిస్థి ఒకటి వస్తదని ముందే ఊహించారా? అనేది జవాబు లేని ప్రశ్నగా చూడాల్సి ఉంది. ఏదేమైనా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ స్థాయిలో నగదు, మద్యం, విలువైన వస్తువులతో ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం లేకపోలేదు.