టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ అదినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంగళవారం మరోమారు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియావేదికగా జగన్ తీరును ఎండగట్టిన లోకేశ్… జగన్ చేసిన మరో కుంభకోణాన్ని బయటపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం చుట్టూ జగన్ భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలసిందే. సొంత ఖర్చులతోనే ఇల్లు కట్టుకున్న జగన్… ఆ ఇంటికి తన సొంత ఖర్చులతోనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఉంటారులే అన్న భావన వ్యక్తమైంది. అయితే తాను సీఎంగా ఉండగా… తన నివాసానికి వేసుకున్న ఫెన్సింగ్ కోసం ఆయన ప్రజా ధనాన్ని వినియోగించారని తాజాగా లోకేశ్ బయటపెట్టారు.ఫెన్సింగ్ కోసం జగన్ ఏకంగా రూ.12.85 కోట్ల మొత్తాన్నిఖజానా నుంచి వినియోగించుకున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ తీరుపై నిప్పులు చెరిగిన లోకేశ్…”ఐదేళ్లూ .జనం సొమ్ము మేసేసి తాడేపల్లి ప్యాలెస్ లో గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న జగన్… చివరికి ఇంటి చెట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేశాడు. మళ్లీ సత్యహశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు వేస్తుంటాడు. ఐదేళ్లలో దోసేసిన వేలకోట్లు, నీ సాక్షి మీడియాకు ధారపోసిన వందల కోట్లు, కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్ లు, తాగిన నిమ్మకాయనీళ్లన్నీకక్కించే రోజు దగ్గర పడుతోంది. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైంది.” అంటూ లోకేశ్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
ఇక తన భద్రత కోసం తన ఇంటి చెట్టూ ఉన్న నివాసాలను బలవంతంగా ఖాళీ చేయించిన చరిత్ర జగన్ దని లోకేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయా నివాసాల్లో ఉన్న జనాన్ని తరిమేసిన జగన్… వారి స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. ఆ తర్వాత ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ను ప్రజల సొమ్ముతోనే నిర్మించుకున్నారని మండిపడ్డారు. ఆంత మేర బరితెగించిన జగన్ ఇప్పుడేమో పత్తిత్తు కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు. జగన్ సాగించిన అక్రమాలను ఒక్కొక్కటిగానే బయటపెడుతున్న లోకేశ్.. ఆ అక్రమాలపై తనదైన శైలి విమర్శలు గుప్తిస్తున్న తీరు చూస్తుంటే…ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా గోచేసిన జగన్ ను జైలుకు పంపించే దాకా లోకేశ్ ఊరకోరన్న వాదనలు వినిపిస్తున్నాయి.