మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజులు రద్దు చేస్తూ ప్రభుత్వం 77 నెంబరు జీవో విడుదలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఇవాళ తాడేపల్లి సీఎం నివాసం ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. టీడీపీ ప్రధాన కార్యాలయం సీఎం క్యాంపు కార్యాలయానికి దగ్గరగా ఉందనే నెపంతో పెద్ద ఎత్తున పోలీసులు టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని దిగ్బంధించారు. కార్యాలయ సిబ్బందిని భోజనానికి కూడా బయటకు వెళ్లనీయలేదు. దీంతో ప్రధాన గేటు వద్ద టీడీపీ నాయకులకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది.
ముందు జాగ్రత్తట
టీడీపీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారనే తప్పుడు సమాచారంతో పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని దిగ్బంధించినట్టు తెలుస్తోంది. చివరకు టీడీపీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఎవరూ లేకపోవడంతో వారు వెనుతిరిగారు. టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు ముట్డడించడంపై పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు.
Must Read ;- వెండి సింహాల చోరీ కేసును చేధించిన పోలీసులు