స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ చేయాలనుకున్నారు. కథ అల్లు అర్జున్ కి చెప్పడం.. కథ నచ్చి ఖచ్చితంగా ఈ సినిమా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ.. ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు బోయపాటి శ్రీను, మురుగుదాస్, ప్రశాంత్ నీల్.. ఇలా కొంత మంది దర్శకులు క్యూలో ఉండడంతో వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ ఉంటుందా..? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది.
మరో వైపు వేణు శ్రీరామ్ నానితో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా నాని వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీ లైన్ కు ఓకే చెప్పారని.. వేణు శ్రీరామ్ తదుపరి చేయబోయే సినిమా ఇదే అంటూ టాక్ వచ్చింది. దీంతో ఇక ఐకాన్ మూవీ లేనట్టే అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఐకాన్ గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. రెండ్రోజుల క్రితమే అల్లు అర్జున్ కి వేణు శ్రీరామ్ ఫైనల్ నేరేషన్ ఇచ్చేసినట్టు, కథ పై అల్లు అర్జున్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని సమాచారం అందుతోంది.
వేణు శ్రీరామ్ ఈ సినిమాని దిల్ రాజు బ్యానర్లో చేయాలనుకున్నాడు. దిల్ రాజు ఐకాన్ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. అల్లు అర్జున్.. తన సినిమాల్ని గీతా ఆర్ట్స్ సహ నిర్మాణంలో జరుగుతున్నాయి. అల వైకుంఠపురములో… అలా వచ్చిన సినిమానే. ఐకాన్ ను కూడా గీతా ఆర్ట్స్ సంస్థలోనే చేయాలనుకుంటున్నారట. దీంతో దిల్ రాజు తప్పుకున్నాడా..? లేక తప్పించారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్, దిల్ రాజు కలిసి గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు. అలాగే. ఐకాన్ మూవీని గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తాయా..? లేక గీతా సంస్థే సోలోగా నిర్మిస్తుందా..? అనేది తెలియాల్సివుంది.