బూతు చిత్రాల నిర్మాణం కేసులో రాజకుంద్రా పీకల్లోతు కూరుకుపోతున్నట్లే ఉంది. తన అనుమతి లేకుండానే రాజ్ కుంద్ర పోర్న్ చిత్రాలు చిత్రీకరించాడంటోంది మరో నటి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబయి పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తన ఫొటోలు, ఆశ్లీల వీడియోలు రాజ్ కుంద్రా తన యాప్ లో ఉంచినట్లు పూనమ్ పాండే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అలాంటి వాడేనంటూ షెర్లిన్ చోప్రా మరో పక్క దాడి చేసింది. తాజాగా ఈ యువతి రంగంలోకి దిగింది.
రాజ్ కుంద్రా మంచోడు కాదని, తనకు ఇచ్చిన మాటను అతను తప్పాడని ఆమె అంటోంది. తన రహస్య భాగాలను వీడియోలో చూపకూడదనే షరతుతోనే అందులో నటించానని, అందుకు తనకు భారీగానే డబ్బు ముట్టజెప్పినట్టు కూడా ఆమె పేర్కొంది. అయితే ఆయన మాటతప్పారని, తన అనుమతి లేకుండానే పూర్తి వీడియోని హాట్ షాట్స్ యాప్ లో పెట్టారని ఆమె ఆరోపిస్తోంది. రాజ్ కుంద్ర ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా చాలా మంది రాజ్ కుంద్రాపై ఆరోపణలతో ముందుకు వస్తున్నారు.
గెహానా సంగతేంటి?
పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన గెహనా వశిష్ఠ మరో సంచలనానికి తెరతీశారు. పోర్న్ కీ, బూతుకూ ఉన్న తేడా ఏంటో తనకు తెలియజేయాలంటూ నెటిజన్ల ముందుకు వచ్చారు. ఇన్ స్టా లైవ్ లో నేరుగా నెటిజన్ల ముందుకు నగ్నంగా కనిపించి సంచలనం రేకెత్తించారు. ఇలా కనిపించడం పోర్న్ అంటారో వల్గారిటీ అంటారో చెప్పండంటూ నెటిజన్లకు ప్రశ్నలు సంధించింది. ఈ తేడాను తెలియజెప్పడానికే తాను ఇలా లైవ్ లోకి రావాల్సి వచ్చిందన్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రాతో పాటు గెహనాపై కేసు నమోదైనా ఆమెకు బెయిల్ దొరికింది. ఆమె న్యూడ్ వీడియోలు చేసిందన్నది ప్రధాన అభియోగం.
తనను అరెస్టు చేయకుండా ఆమె పోలీసులకు లంచం ఎరగా చూపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఫిబ్రవరిలోనే ఆమె వార్తల్లోకి ఎక్కింది. గంధీ బాత్ వెబ్ సిరీస్ తో ఆమెకు పాపులారిటీ వచ్చింది. గెహానాకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనపై గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ నటి ఆరోపించింది. తనపై ఆరోపణలు చేసిన నటి దురుద్దేశపూర్వకంగా తనను ఆ కేసులో ఇరికించిందని కూడా గెహనా అంటోంది. బహుశా ఈ విషయంలో రాజ్ కుంద్రా సపోర్ట్ ను ఆమె కోరడం కూడా కుంద్రా ఇందులో ఇరుక్కోడానికి ఓ కారణమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఓ పత్రిక ఇంటర్వ్యూలో గెహనా మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 4 న పోలీసులు నన్ను అరెస్టు చేశారు, నా ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అనేక చాట్‌లు ఉన్నాయి, నేను పోలీసుల నుంచి కోరుకునేది ఏమిటంటే ఆ అమ్మాయితో పాటు నా చాట్‌ను కూడా తెచ్చి కోర్టులో చూపాలి’ అంది. తను ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పుడు ఆ తర్వాత ఆమె తన ముందుకు ఎందుకు రాలేదని గెహనా ప్రశ్నిస్తోంది. నేను కుంద్రాకు మద్దతుగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని కూడా భావిస్తున్నా. ఆమె తన ఇష్టానుసారమే హాట్ షాట్స్ వీడియోల్లో నటించిందని, ఆమెను ఎవరూ బలవంతం చేయలేదని పేర్కొంది.
Must Read ;- రాప్, పాప్ లతో అదరగొట్టే ‘యోయో’.. అయ్యో!