బూతు చిత్రాల ఊబిలోకి రాజ్ కుంద్రా కూరుకుపోయారు. డబ్బు సంపాదించాలంటే బూతు చిత్రాలలోనే భవిష్యత్తు ఉందని రాజ్ కుంద్రా భావించినట్టు తెలుస్తోంది. ఈ పోర్న్ చిత్రాల వ్యవహారం బట్టబయలు కావడంతో బాలీవుడ్ లో ‘అశ్లీల’ తేనెతుట్టు కదులుతోంది. కేవలం రాజ్ కుంద్రా పేరు మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా ఇలాంటి చేస్తూ సంపాదించుకుంటుంటే వేరేవారు కూడా ఇలాంటి వాటిలోకి దిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు బాలీవుడ్ లోనూ, ఇతర భాషల్లోనూ ఇలా ఇంకెంత మంది ఇదే బాటలో పయనిస్తున్నారో తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి కేసుల్లో అరెస్టులు కావడం, కొంత కాలం పాటు వార్తల్లో నలగడం, ఆతర్వాత కేమంగా బయటకు రావడం షరామూమూలే. కాకపోతే కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ నడుస్తుంది. రోజూ ఏవో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తుంటాయి. ఇలాంటి వీడియో కోసం రాజ్ కుంద్రా తనను కూడా అడిగాడని పునీత్ కౌర్ వెల్లడించింది. ఈ విషయంలో తనకు మెసేజ్ చేసినట్టు ఆమె చెప్పింది. హాట్ షాట్స్ అనే అడల్ట్ యాప్ కోసం పోర్న్ వీడియోలు తీసినట్టు రాజ్ కుంద్రాపై ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఈ నెల 23 వరకూ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు.
రాజ్ కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు ఇది మొదటిసారి కాదు. గతంలో పూనమ్ పాండే, సాగరికా షోనా సుమన్ కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు పునీత్ కౌర్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసింది. దీనిపై తన ఇద్దరు స్నేహితులతో చర్చించిన వీడియోను కూడా బయటపెట్టింది. తనను నగ్నంగా ఆడిషన్ చేస్తానని కుంద్రా అడిగినట్టు సాగరికా షోనా సుమన్ ఆరోపించింది. ఇక పూనమ్ పాండే విషయానికి వస్తే 2019లో బాంబే హైకోర్టులో కుంద్రాపై కేసు కూడా ఫైల్ చేసింది.

కుంద్రాపై ఫిబ్రవరి నుంచే ఇలాంటి ఆరోపణలు వెలుగు చూశాయి. రాజ్ కుంద్రా వ్యవహారంపై ‘గంధీ బాత్’ నటి గెహనా వశిష్ట్ కూడా స్పందించింది. తాము ఎలాంటి పోర్న్ వీడియోలు చేయలేదని అంది. అవి నార్మల్ ఎరోటికా వీడియోలుగా చెప్పింది. తమపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంది. అశ్లీలం వేరు, శృంగారం వేరు అంటోందామె. ఏక్తాకపూర్ లాంటి వారు చేసే వీడియోల కేటగిరీ కిందే తమవి కూడా వస్తాయంటోంది. దాంతో ఏక్తా కపూర్ కూడా అలాంటి వీడియోలు చేస్తోందా అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. నేరస్తులెవరో కోర్టు తేలుస్తుందని అంది. అసలైన పోర్న్ వీడియోలపై దృష్టిపెట్టాలని కూడా ఆమె అంటోంది.
ఆమె ఆ మాట అనడాన్ని బట్టి చూస్తుంటే నేటి సమాజంలోకి పోర్న్ వీడియోలు ఎన్ని వచ్చాయో కదా అనిపిస్తోంది. రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ రిప్రజంటేటివ్ గా పనిచేశారు. అదే సమయంలోనే ఈ సంస్థ ద్వారా పోర్న్ వీడియోల తయారీ కోసం చాలామంది ఏజంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అలా ఒప్పందం చేసుకున్నవారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి. నటి శిల్పాశెట్టి భర్తగానే రాజ్ కుంద్రాకు గుర్తింపు ఉండటంతో ఈ మకిలి శిల్పకు కూడా అంటింది. అసలు ఈ వ్యవహారంలో శిల్ప పాత్ర ఎంత ఉంది అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Must Read ;- ఆర్జీవీతో బూతు ఇంటర్వ్యూపై అరియానా ఏమందంటే?











