Raj Kundra Used To Earn 1 To 10 Lakhs Daily :
డబ్బు సంపాదించాలంటే బూతు చిత్రాల నిర్మాణమే శరణ్యమా? రాజ్ కుంద్రా వ్యవహార శైలి చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. అప్పట్లో నటి శిల్పాశెట్టి యోగా వీడియోల కోసం వాడిన యాప్స్ ను మరోలా వినియోగించుకుంటే డబ్బులే డబ్బులు అని రాజ్ కుంద్రా భావించినట్టుంది. దాదాపు వందలాది పోర్న్ వీడియోలు అతను రూపొందించాడంటే ఎప్పట్నుంచి అతను ఇలా చేస్తున్నడో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతనికి చెందిన హాట్ హిట్ అనే యాప్ ద్వారా పోలీసులు లెక్కలు బయటికి తీశారు.
ఈ ఒక్క యాప్ ద్వారానే రోజు రూ. 10 లక్షలు దాకా సంపాదించినట్టు తేలింది. బ్యాంకుల నుంచి పోలీసులు అతని ఆర్థిక లావాదేవీలను సేకరించారు. మొదట్నుంచి రాజ్ కుంద్రా వ్యవహార శైలిని చూస్తే అతనికి డబ్బు సంపాదన తప్ప మరో యావ ఉన్నట్లు లేదు. దానికి అడ్డదారులనే అతను ఎంచుకున్నాడు. 2009లో అతను శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు. నాడు బెట్టింగుల నుంచి నేటి పోర్న్ చిత్రాల దాకా అతను అనుసరించిన మార్గాలన్నీ చీకటి దారులే. రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతిగా జనానికి పరిచయమై ఆ తర్వాత బెట్టింగ్ ఆరోపణలతో అతనిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
లండన్ తో అతని వ్యాపార లావాదేవీలు ముడిపడి ఉన్నాయి. అతను స్థాపించిన నిర్మాణ సంస్థ కూడా యూకేకి సంబంధించిందే. వెస్ట్ ముంబై నుంచి నీలి చిత్రాలు తీస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. ఉమేష్ కామత్ అనే వ్యక్తి రాజ్ కుంద్రా తరఫున ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నాడు. హాట్ హిట్ యాప్ నుంచి వచ్చే డబ్బంతా చివరికి రాజ్ కుంద్రా అకౌంట్ కు బదిలీ అవడాన్ని పోలీసులు గుర్తించారు.
రాజ్ కుంద్రాతో పాటు అతని సోదరుడు ప్రదీప్ బక్షికి కూడా ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయి. అతని అజమాయిషీలో ఉన్న ఈ యాప్ ను యూకేకు చెందిన కెన్రిన్ సంస్థకు అమ్మారు. ముఖ్యంగా ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అందరూ సమస్యల్లో ఉంటే రాజ్ కుంద్రా మాత్రం ఈ పోర్న్ చిత్రాలు తీస్తూ చేతినిండా సంపాదించాడు. ఇందులో శిల్ప పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. రాజ్ కుంద్రా ఇంటిపై పోలీసులు నిన్న రైడ్ చేసి కొన్ని ఆధారాలను కనుగొన్నట్లు తెలిసింది. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితా శెట్టిని కూడా క్రైమ్ పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
Must Read ;- అరెస్టు కాకుండా రాజ్ కుంద్రా రూ. 25 లక్షల లంచం?











