రాప్, పాప్ పాటలతో అదరగొట్టే హనీసింగ్ కు ఇప్పుడు కుయ్యోమొర్రో అనే పరిస్థితి ఏర్పడింది. ఇంతులతో పెట్టుకుంటే ఇంతేగతి అని ఇంటిపోరుతో బయటపడింది. హనీసింగ్ బండారాన్ని అతని భార్యే బట్టబయలు చేసింది. బాలీవుడ్ సింగర్ గా, నటుడిగా పేరు సంపాదించుకున్న యోయో హనీసింగ్ పై అతని భార్య షాలినీ తల్వార్ సింగ్ గృహహింస, మానసిక హింస, ఆర్థిక మోసం కేసులు నమోదు చేసింది. పైగా తనకు రూ. 10 కోట్ల పరిహారం ఇప్పించాలని ఆమె డిమాండు చేస్తోంది.
ఈమేరకు కోర్టు కూడా హనీసింగ్ కు నోటీసులు జారీ చేసింది. పైగా షాలిని అతనిపై చేసిన ఆరోపణలు మామూలుగా లేవు. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాడని, అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, నిలదీస్తే కొట్టేవాడని, తన మామ కూడా తనపై అసభ్యంగా ప్రవర్తించే వాడని.. ఇలా ఎన్నో రకాల ఆరోపణలను ఆమె చేస్తోంది. షాలిని కోర్టుకు సమర్పించిన 120 పేజీల లేఖలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ‘2011లో మా పెళ్లయ్యింది. హనీమూన్ అయ్యాక అతనిలో సడన్ గా మార్పు వచ్చింది.
ఇష్టం లేకపోయినా ఆమెకు ఇచ్చిన మాట కారణంగా పెళ్లి చేసుకున్నానన్నాడు. అతను టూర్లకు వెళ్లినా నన్ను తీసుకెళ్లేవాడు కాదు. సోషల్ మీడియాలో తమ ఫొటో లీక్ కారణం కావడానికి కూడా నేనే కారణమని అన్నాడు. అమ్మాయిలతో ఉన్న ఫొటోలను సినిమా స్టిల్స్ అనేవాడు. బెంగాలీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు’ అంటూ ఆమె పేర్కొంది. ఓ మహిళతో అతనికి ఉన్న సంబంధం పై నిలదీసినప్పుడు తనపైకి మందు బాటిళ్లు విసిరాడని కూడా చెప్పింది. తను బట్టలు మార్చుకుంటుంటే హనీసింగ్ తండ్రి తన గదిలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. చిత్రహింసలకు సంబంధించి తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పింది.
హనీసింగ్ లో ఎందుకీ మార్పు?
తన సంగీతపరమైన ప్రతిభతో ప్రపంచం దృష్టినే అతను ఆకర్షించాడు. అలాంటి హనీసింగ్ గత కొంతకాలంగా సంగీత ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. అతని వైవాహిక జీవితంలో ఏర్పడిన ఇబ్బందులే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పుడు అతని ప్రతిష్ఠ మరింత మసకబారింది. ఆగస్టు 28 లోపు అతను కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తనను మానసికంగా వేధించినందుకు కూడా పరిహారం చెల్లించాలని ఆమె కోరుతోంది. కోర్టుకు తగిన ఆధారాలను కూడా ఆమె అందించింది. హనీసింగ్ తల్లితో కలిసి ఉండలేనని, ఢిల్లీలో తను వేరే చోట ఉండేందుకు రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా ఆమె కోరింది. ఈ ఆరోపణల మీద హనీసింగ్ ఇప్పటిదాకా నోరు విప్పలేదు.
Must Read ;- నాగబాబు అల్లుడు చైతన్య ఫ్లాట్ లో గొడవ ఏమిటి?











