టాలీవుడ్ డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇటలీలో కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈసినిమాకి దర్శకుడు జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోని ప్రభాస్ లుక్ కు ఫిదా అవుతున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే.. ఇటలీలో ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధేశ్యామ్ చిత్ర బృందంతో కలిసి ప్రభాస్ కేక్ కట్ చేశాడు. బ్లాక్ లెదర్ జెర్కిన్ లో హ్యాండ్ సమ్ గా రివీల్ అయిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ మూవీ . పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో విడుదల కానుంది.