వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే భారీ సినిమాలో అతడు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయింతి మూవీస్ బ్యానర్ లో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇందులో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనె కథానాయికగా ఖరారు అయింది.
అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన ప్లాన్ ను మార్చుకున్నాడని తెలుస్తోంది. ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కాకుండా ఓం రావుత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఆది పురుష్’ సినిమాను మొదటగా పట్టాలెక్కించాలని ప్రభాస్ భావిస్తున్నాడని సమాచారం. ‘ఆది పురుష్’ సినిమా తర్వాత తక్కువ గ్యాప్ తీసుకొని నాగ్ అశ్విన్ సినిమా మొదలుపెట్టాలని ప్రభాస్ చూస్తున్నాడట.
ఈ వార్త నిజమైతే నాగ్ అశ్విన్ కు గట్టి షాక్ తగిలిందనే అనుకోవాలి. ఎందుకంటె ‘రాధే శ్యామ్’, ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్స్ పూర్తి అవడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ వెయిట్ చేయాలి. మరి అప్పటివరకు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తాడా, లేక ఈలోపులో వేరే హీరోతో మరొక సినిమా చేస్తాడో చూడాలి. ఏదిఏమైనా ప్రభాస్ సినిమాల కోసం మాత్రం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ వార్తపై నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.