పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మూవీ టైటిల్ సలార్ అని కూడా ప్రకటించడం.. పోస్టర్ రిలీజ్ చేయడం తెలిసిందే. గన్ పట్టుకుని పవర్ ఫుల్ లుక్ లో ఉన్న ప్రభాస్ స్టిల్ చూసినప్పటి నుంచి సలార్ అంటే ఏంటి..? ఈ టైటిలే ఎందుకు పెట్టారు. అసలు ఈ సలార్ స్టోరీ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. అంతే కాకుండా.. ప్రభాస్ రాథేశ్యామ్ తర్వాత సలార్ మూవీనే చేయనున్నారని తెలిసినప్పటి నుంచి మిగిలిన సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మరింత ఆసక్తిని పెంచుతుంది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్టోరీని బయటపెట్టాల్సిన అవసరం వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..? మేటర్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాని ప్రకటించగానే.. కర్నాటకలో ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారట. కారణం ఏంటంటే.. కేజీఎఫ్ తో పేరు రాగానే కన్నడ ఇండస్ట్రీని వదిలేశాడని.. నెక్ట్స్ మూవీకి ప్రభాస్ ని హీరోగా ఎంచుకున్నాడని విమర్శలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ నీల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఏం చెప్పారంటే.. తన కథకు అమాయకంగా ఉండే స్టార్ హీరో కావాలి.
Also Read ;- మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తోన్న ధనుష్
ప్రభాస్ లో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అమాయకంగా అద్భుతంగా నటిస్తాడు. అలాంటి లక్షణాలు ఉన్న మరొక హీరో కనపడలేదు అన్నారు. అంతే కాకుండా.. తన కథలో హీరో అమాయకత్వంగా ఎందుకు కనిపించాలి అనేదానికి కూడా వివరణ ఇచ్చాడు. ఉపకారం మాత్రమే చేయడం తెలిసి.. అపకారం చేయని అమాయకుడు కరడుగట్టిన నాయకుడిలా ఎలా మారాడు అనేదే కథ అని చెప్పేశాడు. ఇక సలార్ అర్ధం ఏంటో కూడా చెప్పేశాడు. ఇంతకీ సలార్ అంటే ఏంటంటే.. ఒక్కొ భాషలో ఒక్కో అర్ధం ఉన్నప్పటికీ.. అందరూ చెప్పుకునేది సలార్ అంటే కమాండర్ అని అర్ధమట.
ఈ విధంగా సలార్ స్టోరీని బయటపెట్టేసారు ప్రశాంత్ నీల్ ఇలా.. సలార్ స్టోరీ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ పాన్ ఇండియా మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. 2021లోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- పాపం నాగ్ అశ్విన్.. వెనక్కి తోసేశారా..?