వరుస పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ భారతీయ సినీ పరిశ్రమలోనే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రభాస్ రీసెట్ గా ‘కేజియఫ్’ ఫేమ్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ‘సలార్’ మూవీ లో హీరోయిన్ ఎవరనే వార్తపై ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుంచి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది పేర్లను పరిశీలించిన దర్శకుడు ప్రశాంత్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఫైనల్ చేశాడని తెలుస్తోంది. అమ్మడు పూరి జగన్నాథ్ ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి విదితమే. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన దిశా తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు ప్రశాంత్ హీరోయిన్ దిశాకు కథ వినిపించాడని, తన క్యారక్టర్ కు సంబంధించిన ఎలిమెంట్స్ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని సమాచారం.
సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కి కూడా నటించడానికి మంచి స్కోప్ ఉన్న స్టోరీ ‘సలార్’ అన్ని తెలుస్తోంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటుగా ‘సలార్’ సినిమా షూటింగ్ కూడా ఏకకాలంలో తెరకెక్కుతుందని టాక్. మరి ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ప్రభాస్ తెలుగు నిర్మాతలకు హ్యాండ్ ఇవ్వడానికి కారణం ఇదేనా.?











