యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? ఇందులో ప్రదీప్ సరసన అమృత అయ్యార్ నటించింది. ఈ మూవీలోని పాటలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం.. అనే పాటకు యూట్యూబ్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే… 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది.
గత సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. అయితే.. ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తామని చెప్పినప్పటికీ.. థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ఈ చిత్ర దర్శకనిర్మాత చెప్పారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆఖరికి ఇప్పుడు ఈ మూవీకి జనవరి 29న రిలీజ్ డేట్ ఖాయం చేశారు. విడుదల తేదీ తో ఉన్న పోస్టర్స్ తో ప్రచారం కూడా మొదలైంది.
బుల్లితెర పై బాగా పాపులర్ అయిన ప్రదీప్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కావడం.. పైగా ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో రూపొందడంతో ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకనే ఓటీటీలో రిలీజ్ చేయమని భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ నో చెప్పి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మరి..యాంకర్ గా సక్సస్ అయిన ప్రదీప్ హీరోగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Must Read ;- సంక్రాంతికి రెడ్ సందడి ఓ రేంజ్ లో ఉంటుందట!
https://www.youtube.com/watch?v=XjJTtKTbR84











