ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా రెడ్ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన క్రేజ్ కి తగ్గట్టుగా రెడ్ మూవీ ఉంటుందని.. మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం అని రామ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. రామ్ మాత్రం ఇప్పటి వరకు తదుపరి చిత్రం ఎవరితో అనేది కన్ ఫర్మ్ చేయలేదు.
కొన్ని స్క్రిప్ట్ లు విని రిజెక్ట్ చేసాడు కానీ.. ఏ స్ర్కిప్ట్ కి ఓకే చెప్పలేదు. అయితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. రామ్ కానీ.. త్రివిక్రమ్ కానీ.. క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మీడియాతో ఇంట్రాక్ట్ అయిన రామ్ త్రివిక్రమ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ రామ్ ఏం చెప్పారంటే.. త్రివిక్రమ్ తో సినిమా ఇంకా కథా చర్చల దశలోనే ఉంది.
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పలేను అన్నారు. అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి త్వరలోనే వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారు. అంతే కాకుండా తన దగ్గర కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు వాటితో సినిమాని ప్రకటిస్తానన్నారు. మరి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలనే రామ్ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో..?
Must Read ;- ‘రెడ్’ వెర్సెస్ ‘అల్లుడు’.. పెద్దల సమక్షంలో పంచాయితీ