కరోనా కాలంలో షూటింగ్ విరామానికి కేజీఎఫ్ 2 టీమ్ స్వస్తి పలికింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించేశారు. నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమా షూటింగులో పాల్గొన్నారు. కరోనావైరస్ సంజయ్ దత్ అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు కేజీఎఫ్ 2 కొంత ఇబ్బందికి గురిచేశాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం మిగతా పార్ట్ పూర్తి చేసేయాలని గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాడు.
‘అధీరా’ పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో హీరో యశ్ – సంజూ మధ్య ప్లాన్ చేసిన భారీ ఫైట్ షూటింగ్ ను వాయిదా వేశారంటున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయటం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలాకాలం నిలిచిపోయింది.
ఇందులో బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. సినిమాలో ఇప్పటికే విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ కు సంబంధించిన షూట్ దాదాపు పూర్తయిందని అంటున్నారు. డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్మాతలు ఇటీవల వెల్లడించారు. ఈ బుధవారం నుంచి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ లో హీరో యశ్ తోపాటు ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్ తదితరులు పాల్గొంటున్నారు.