ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు తీవ్ర ఎండలు… ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు ఎవరైనా బయట అడుగు పెడతారా… పైగా ఐదు నెలల గర్భవతి కూడా. బయటకు వెళ్లాలనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ ఛత్తీస్‌గడ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్ దంతేవాడ డీఎస్పీ శిల్పసాహు ఐదు నెలల బిడ్డను కడుపుకొని పెట్టుకొని లాఠీ పట్టింది. గర్భవతిగా ఉండి కూడా మండే ఎండల్లో కరోనాను లెక్కచేయకుండా, ట్రాఫిక్ విధులు నిర్వహించారు. కరోనా వేళ, లాఠీ పట్టిన ఈ మహిళా డీఎస్పీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఫ్రంట్‌లైన్ వారియర్‌గా కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీకి సోషల్ మీడియాలో సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు.
Must Read ;- కరోనా విలయ తాండవం.. నో లాక్ డౌన్











