మెడిసిన్ స్టూడెంట్స్ అనగానే.. సాధారణంగా ఏం గుర్తుకొస్తాయి…? పుస్తకాలు, ల్యాబ్స్, ప్రాక్టికల్స్ తో బిజీగా ఉంటారు. కానీ విద్యార్థులు మాత్రం కొంచెం డిఫరెంట్. ఒకవైపు చక్కగా చదువుకుంటూనే, అప్పుడప్పుడు నచ్చిన హాబీస్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. తాజాగా కేరళకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరు మెడికల్ కాలేజీ యూనిఫామ్‌లోనే అద్భుతమైన ఫుట్ వర్క్, సున్నితమైన కదలికలు, పాటకు తగిన హావభావాలను పలికిస్తూ డ్యాన్స్ చేశారు. త్రిస్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన జానకి ఓం కుమార్, నవీన్ కె రజాక్ ప్రముఖ బోనీ ఎం గ్రూప్‌కు చెందిన రాస్‌పూటిన్ సాంగ్‌కు ఇద్దరు అద్భుతంగా తమ కాలేజీ కారిడార్‌లో చిందులు వేశారు.
వీడియో వైరల్
జానకి మెడిసిన్ మూడో ఏడాది విద్యార్థిని, నవీన్ నాలుగో ఏడాది విద్యార్థి. ముందుగా వారు చేసిన డ్యాన్స్ వీడియోను నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా వారు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్స్ వావ్… ,అమేజింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లోనూ చక్కర్లు కొడుతోంది.
Also Read:సారంగ దరియాతో ఫిదా చేస్తున్న సాయి పల్లవి











