తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతి ఉప ఎన్నికల కోసం దొంగ ఓటరు కార్డులు తయారు చేయడంతో పాటు, వేలాది మందిని దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి తరలించారని రత్నప్రభ హైకోర్టుకు తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా, పోలీసులు ఎక్కడా తనిఖీలు కూడా నిర్వహించలేదని, వేలాది మంది బస్సుల్లో తరలివస్తుంటే చూస్తూ ఉండిపోయారంటూ బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కోర్టుకు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లు చెలరేగిపోయారని కోర్టుకు విన్నవించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూడా రత్నప్రభ కోర్టుకు తెలిపారు.
2 లక్షల దొంగ ఓటరు కార్డుల తయారీ
తిరుపతి ఉప ఎన్నికల్లో 2 లక్షల దొంగ ఓటరు కార్డులు ముందుగానే తయారుచేసి పెట్టుకున్నారని, ఎన్నికల రోజున చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల నుంచి బస్సుల్లో వేలాది మందిని తరలించి అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించుకున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కోర్టుకు తెలిపారు. ఓట్లు వేసేందుకు దొంగ ఓటరు కార్డులతో క్యూ లైన్లలో నిలబడ్డ వారు తండ్రి పేరు, భర్త పేరు కూడా చెప్పలేకపోయారని, దొంగ ఓటర్లు అనడానికి ఇదే నిదర్శనమని ఆమె హైకోర్టుకు తెలిపారు.
Must Read ;- పుంగనూరు వీరప్పన్ మంత్రి పెద్దిరెడ్డి.. నారా లోకేష్











