ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వీఎంసీ ప్రొడక్షన్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా.
ఆ తర్వాత అన్నమయ్య, సింహద్రి వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. పంపిణీదారుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన గురుశిష్యులు సినిమాతో ఆయన 1981లో పంపిణీదారుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో నిర్మాతగా కిరాయి దాదా ఆయన తొలిచిత్రం. నిర్మాతగా పది చిత్రాలు నిర్మించారు.