January 24, 2026 7:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బాబుకు మద్దతుగా మోడీకి కె.ఎస్. రామారావు లేఖాస్త్రం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అరెస్టును ఖండిస్తూ సీనియర్ చిత్ర నిర్మాత కె. ఎస్. రామారావు ప్రధాని నరేంధ్రమోడీకి ఓ లేఖ రాశారు. ఆ సారాంశం ఇది.

September 16, 2023 at 7:17 PM
in Cinema
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పరిస్థితులపైనా, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సీనియర్ చిత్ర నిర్మాత కె. ఎస్. రామారావు లేఖాస్త్రాన్ని సంధించారు.

భారతీయ జనతా పార్టీ బలోపేతమవడానికి చంద్రబాబు ఏ విధంగా తోడ్పడ్డారో కూడా ఆ లేఖలో రామారావు వివరించారు. ఈ అరెస్ట్ వెనుక పరోక్షంగా భాజపా హస్తం ఉన్నట్టు భావించాల్సి వస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ లేఖను పూర్తిగా ఇస్తున్నాం చదవండి.

ప్రధాని నరేంద్ర మోడీ గారూ నమస్కారం,

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతుందో గమనించరా!? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట మీకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మీ పార్టీ సైతం మద్దతు ఇచ్చింది. తరువాత పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ అని ప్రకటించినప్పుడు కూడా మీ పార్టీ సైతం మద్దతు పలికింది. రాష్ట్రవిభజన చేసిన కాంగ్రెస్ పై సీమాంధ్రులకు ఎలాంటి అభిప్రాయం ఉందో, అందుకు సహకరించిన మీ పార్టీపైనా అదే అభిప్రాయం ఉంది. అయితే 2014 ఎన్నికల్లో మీరు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు సంపాదించగలిగారంటే అందుకు కారణం ఒకే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం!

అప్పుడే కాదు, మీ పార్టీ పాలనకు పునాది వేసిన ఘనమైన అటల్ బిహారీ వాజ్ పేయి గారి పాలనను ఓ సారి గుర్తు తెచ్చుకోండి. అంతకు ముందు అదే వాజ్ పేయి ప్రభుత్వం 13 రోజులకు ఓ సారి, 13 నెలలకు మరోసారి పతనమయింది. వాజ్ పేయి ప్రభుత్వము పూర్తి కాలం సాగేలా చేసిన ఘనత ఆ నాడు యన్.డి.ఏ.కు కన్వీనర్ గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిదే . ఈ విషయం తెలుగునేలపైనే కాదు, యావద్భారతావని కీ తెలుసు. ఆ నాడు వాజ్ పేయి ప్రభుత్వం ‘ఫుల్ టెర్మ్’ కొనసాగబట్టే, తరువాతి రోజుల్లో మీ పార్టీ బలోపేతమయింది.

తరువాత జాతీయ స్థాయికి మళ్ళీ చేరుకుంది. 1999 -2004 మధ్యకాలంలో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతీసారి వాటిని ఎదుర్కోవడంలో బాసటగా నిలచింది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడే గారే . ఇవన్నీ మీకు తెలియనివి కావు. అందుకే మీ పార్టీ పెద్దలు ‘నమ్మదగ్గ స్నేహితుడు’ అని చంద్రబాబును కీర్తించినప్పుడు ఆయనతో కలసి 2014 ఎన్నికల్లో సాగారు. చంద్రబాబుతో జోడీ కట్టడంతోనే మీ పార్టీకి కొన్ని ఓట్లు, సీట్లు దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో మీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని ఓట్లు సంపాదించిందో గుర్తు తెచ్చుకోండి.

యన్.డి.ఏ.కు కన్వీనర్ గా ఓ వెలుగు వెలిగి, జాతీయ స్థాయిలో మీ కంటే ముందే గుర్తింపు సంపాదించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగానూ మీ కంటే సీనియర్. 1996 ప్రాంతంలో దేవెగౌడ కంటే ముందే ప్రధాని పదవి ఆయన దగ్గరకు వచ్చినా, దానిని కాదనుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికే పరిమితమయ్యారు. నేడు అందరూ వేనోళ్ళ కొనియాడుతున్న ‘సాంకేతికాభివృద్ధి’ని పరిచయం చేశారు. టెక్నాలజీతో పయనిస్తూ, భావితరాలకు టెక్నాలజీ గొప్పతనాన్ని చాటుతూ ‘హెటెక్ సీయమ్’ అనీ కీర్తిని సంపాదించారు.

ఇక మీరు ప్రధానిగా ఉన్న సమయంలో తన సీనియారిటిని పక్కన పెట్టి, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకితమయ్యారు. కాంగ్రెస్ తో కలసి, పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ సైతం మద్దతు పలికిన ‘ప్రత్యేక హోదా’ను పక్కకునెట్టి ‘ప్రత్యేక ప్యాకేజ్’ అంటూ మీరు ప్రతిపాదించగా, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో దానికి అంగీకరించారు. మీతో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది . ఇందుకు మీ పాత్ర లేదంటారా ?

మీతో స్నేహహస్తం చాచిన చంద్రబాబును తనకు తాను కూటమి నుండి బయటకు వెళ్ళేలా పథక రచన చేశారు. జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబు కేవలం తన రాష్ట్ర అభివృద్ధి కోసమే తన ప్రాభవాన్ని సైతం పరిమితం చేసుకొని పాటుపడుతూ ఉంటే, సీమాంధ్రులకు మీరు స్వయంగా ఇచ్చిన మాటను సైతం మరచి, చంద్రబాబును నెట్టేశారు. ఓటమిపాలయినా, చంద్రబాబు నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పాటుపడుతూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజా పక్షం వైపే నిలిచారు, ప్రజాక్షేమమే అని తలచారు.

అలాంటి చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబసభ్యులను సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అగౌరవపరచినా, మీరు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీని కానీ, అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి కానీ పూనుకోలేదు. ఏ నాడూ దేనికీ చలించని చంద్రబాబు నాయుడు తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న దృశ్యం తెలుగువారిని కలచి వేసింది. మరి ఇప్పుడు అంతకంటే ఊహించని ఘటన తెలుగువారి మనస్సును బాధించింది. అందుకు కారణం పైకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కనిపిస్తున్నా, వారికి అడుగడుగునా సహకరిస్తున్నది మీరే అన్న విషయం తెలుగువారందరికీ తెలుసు.

తన రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పాటు పడుతూ, 73 ఏళ్ళ వయసులోనూ ఊరూరా తిరుగుతూ తన పార్టీ కోసం ప్రచారం చేసుకుంటున్న నారా చంద్రబాబు నాయుడును ‘స్కిల్డ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్’ కుంభకోణంలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అన్యాయం ,అక్రమం . నిజానికి ఆ కేసులో మొదట చంద్రబాబు పేరే లేదు. తరువాత ఆయనను ‘ఏ-37’గా పేర్కొన్నారు. అరెస్ట్ చేశాక ఏకంగా ‘ఏ-1’గా చిత్రీకరించారు.

ఆధారాలు లేకున్నా, కోర్టుకు వాటిని చూపించే శక్తిలేక పోయినా, అగ్రిమెంట్ లో చంద్రబాబు చేసిన సంతకాలను సాక్ష్యంగా చూపిస్తూ, ఆయన డబ్బు కొట్టేశారని ప్రచారం సాగిస్తున్నారు. ఇది హేయమైన చర్య అయితే, ఇక చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన తరువాత పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని తెలుగువారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నినదిస్తున్నారు .

నిజానికి చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నాయకుడిని, అందునా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే విధానంలో ప్రభుత్వం పాటించలసిన విధానాలేవీ అనుసరించలేదు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ లేదా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలన్న నిబందనను ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించక పోవడం గమనార్హం! చంద్రబాబు నాయుడు ఎక్కడికీ పారిపోరు, పైగా విచారణకు సహకరిస్తాననీ అన్నారు. ‘సోక్రటీస్’ వాదాన్ని అనుసరిస్తూ – ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తానే చట్టాన్ని గౌరవించక పోతే ఎలా అంటూ అరెస్ట్ అయ్యారు. అడుగడుగునా జనం అడ్డుపడ్డా, వారికి నచ్చచెప్పి తాను చట్టాన్ని గౌరవించారు.

చంద్రబాబు నాయుడును ఒకప్పుడు ‘హై టెక్ సీయమ్’ అంటే నవ్వుకున్నవారు సైతం నేడు దేశవిదేశాల్లోని ‘టెకీస్’ అందరూ ఆయనకు మద్దతు పలకడం చూసి నివ్వెరపోతున్నారు. చంద్రబాబు ‘హె టెక్’ అని అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును ఎంతగానో తూలనాడిన కాంగ్రెస్ వారు సైతం ఆయన అరెస్ట్ ను ఖండించారు. వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు పలికారు. అలాంటిది మీ పెద్దలు ‘నమ్మకమైన స్నేహితుడు’ గా భావించే నారా చంద్రబాబుకు ఇంత జరిగినా, మీరు ఏమీ పట్టనట్టు ఉండడం మమల్ని మరింత బాధిస్తుంది .

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ‘వి.ఐ.పి’ ట్రీట్ మెంట్ కల్పిస్తామంటున్న జైలు అధికారులు, కనీసం వేడినీళ్ళ కూడా ఆయన స్నానానికి ఏర్పాటు చేయలేకపోయారు. మీ కంటే వయసులో పెద్దవాడు, 73 ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబుకు చన్నీటి స్నానమే చేస్తూ, దోమలు కుడుతున్నా, ఏ తప్పూ చేయకపోయినా అన్నీ భరిస్తున్నారు. ఇక వారానికి మూడుసార్లు ‘ములాఖత్’కు అవకాశం ఉన్నా, చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరిని జైలు అధికారులు లోపలకు అనుమతించక పోవడం ఏమిటి? ఈ విషయాలన్నీ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటన్నిటి వెనకాల, మీరు ఉన్నారనే తెలుగుప్రజలు భావిస్తున్నారు.

ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో మీ ఆధ్వర్యంలో సాగిన ‘జీ-20’ సదస్సు విజయం సాధించింది. పలు దేశాధినేతలు మిమ్మల్ని ఎంతగానో అభినందించారు. అంతర్జాతీయంగా ఎంతగానో వెలిగిపోతున్న మీ కీర్తి, స్వదేశంలో జరుగుతున్న అంశాల కారణంగా తరిగిపోతుందని ఇప్పటికైనా సమయం మించిపోలేదు.గ్రహించండి . ఓ సీనియర్ గా చంద్రబాబు లాంటి నాయకుడు, మీ పక్కన ఉండడం కూడా మీకు మేలు చేస్తుందే కానీ, ఏ మాత్రం కీడు చేయదు. మీరు లోపాయికారిగా మద్దతు పలికే నేతల కన్నా, చంద్రబాబు స్నేహమే ఈ సమయంలో మీకు ఎంతో మేలు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్ర బాబు నాయుడు గారికి న్యాయం చెయ్యండి .

మీ
కె .ఎస్ .రామారావు ,
సీనియర్ చిత్ర నిర్మాత.

Tags: leotopproducer k.s. rama rao letter to pm modi
Previous Post

ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!

Next Post

అధినేతల పోటీ ఇక్కడ నుంచే..!

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

జగన్ పాలనపై మండిపడ్డ బెజవాడ వాసులు Ap Public Fires on YS Jagan Government | Leo News

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist