బ్లఫ్ మాస్టర్ ‘ డైరెక్టర్ గోపి గణేష్ కి మళ్ళి అవకాశం ఇచ్చారు హీరో సత్యదేవ్ . ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి ” గాడ్సే ” అనే టైటిల్ పెట్టినట్లు అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ వెనక ఆసక్తిదాయకం అయిన సంఘటన ఉంది. జాతి పిత మహాత్మా గాంధీ ని చంపిన హంతకుడు నాథురాం గాడ్సే అని అందరకి తెలుసు. లోగడ సత్యదేవ్ అనే డైరెక్టర్ నట సింహ బాలకృష్ణ తో ” లయన్ ” అనే సినిమా తీశారు. ఆ సినిమా కి గాడ్సే అని పేరు పెట్టాలని డైరెక్టర్ సత్యదేవ్ ప్రయత్నం చేశారు . టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారు .
అయితే బాలకృష్ణ మాత్రం ఆ టైటిల్ వద్దని చెప్పారు. ఎందుకు అంటే కారణాలు ఏమైనప్పటికీ మహాత్మ గాంధీ ని చంపిన హంతకుడి పేరు సినిమా టైటిల్ గా పెడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని బాలకృష్ణ భావించారు. సినిమా పేరు లయన్ గా మార్పించారు బాలకృష్ణ . అప్పుడు డైరెక్టర్ సత్య దేవ్ వదిలేసిన బాలకృష్ణ సినిమా టైటిల్ ‘ గాడ్సే ’ను ఇప్పుడు హీరో సత్య దేవ్ పెట్టుకోవడం ఒక విశేషం అయితే – బాలకృష్ణ రెగ్యులర్ నిర్మాత సి కళ్యాణ్ ఆ సినిమాకి నిర్మాత కావడం మరో విశేషం .