గడచిన ఏడాది కాలంలో శాసన సభ్యులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు, వాటికి ప్రజల నుంచి వచ్చిన స్పందన వంటి అంశాలు తెలియజేయాలంటూ ఓ ప్రశ్నావళిని శాసన సభ్యులకు పంపించింది.
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఎమ్మెల్యేలు ఏ విధంగా సాయపడ్డారో తెలియజేయాలని ఆదేశించింది. కరోనా టెస్టులు చేయించడం, బాధితులకు సరైన వైద్యం అందుతోందో లేదో నిరంతరం తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించారో తెలియజేయాలంటూ ప్రశ్నవళిలో పొందుపరిచారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ చేసారా.. లేదా, చేసి ఉంటే మీ నియోజకవర్గాలలో ఆయా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేయాలని ఎమ్మెల్యేలను అధిష్టానం ఆదేశించింది.
మంత్రులతో శాసన సభ్యులు ఎలాంటి సమన్వయంతో పనిచేసారో తెలియజేయాలని, ఎక్కడైనా విబేధాలు వస్తే వాటిని ఎలా పరిరక్షరించుకున్నారో కూడా ఆ నివేదికలో పొందు పరచాలని సూచించారు.
ఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు
మీమీ నియోజక వర్గాలలో గడచిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించాలని, ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను ఏ విధంగా ఖర్చు చేసారో తెలియజేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈ అభివృద్ది కార్యక్రమాలలో జిల్లాకు చెందిన మంత్రులతో చర్చించారా, ప్రారంభోత్సోవాల సమయంలో ప్రోటోకాల్ పాటించారా… వంటి అంశాలను తెలియజేయాలని ఆదేశించారు. అభివృద్ది కార్యక్రమాలు జరిగే సమయంలో వాటిని చేపట్టిన గుత్తేదారులతో సఖ్యంగా ఉన్నారా…? లేక విబేధాలు వచ్చాయా.. ? తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర సమితీ అధిష్టానం ఆదేశించింది. అలాగే నిధుల విడుదల, అభివృద్ది కార్యక్రమాల కొనసాగింపు వంటి అంశాలలో అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చాయా.. ? లేక వారి నుంచి సహకారం అందిందా.. ? అనే విషయాలు తెలియజేయాలని ఆదేశించింది.
కార్యకర్తలతో సంబంధాలు బాగున్నాయా… ?
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయువుపట్టు అయిన పార్టీ కార్యకర్తలతో ఈ ఏడాది కాలంలో మీ ప్రవర్తన ఎలా ఉందో తెలియజేయాలని అధిష్టానం ఆదేశించింది. కార్యకర్తలను మీమీ కార్యాలయాలలోను, ఇళ్ల వద్దా సక్రమంగా చూసుకున్నారా, లేక విభేదించారా… ? వంటి అంశాలను తెలియజేయాలని సూచించింది. కార్యకర్తల మనోభావాలకు దెబ్బ తగలకుండా ప్రవర్తించాలని, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే కార్యకర్తల వద్దకు మీరే వెళ్లాలని శాసన సభ్యులకు అధిష్టానం సూచించింది.
ముఖ్యంగా మహిళా కార్యకర్తలతో వ్యవహరించిన తీరుపై సమగ్ర సమాచారం ఇవ్వాలని, ఎక్కడైనా వారితో విభేధాలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకున్నారో తెలియజేయాలని తెరాస అధిష్టానం ఆదేశించింది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లే కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించారా అని ప్రశ్నించింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఏ విధంగా స్పందించారో ఆధారాలతో సహా పంపించాలంటూ శాసన సభ్యులకు ఆదేశాలు జారీ చేసింది.
పోలీసులతో ఎలా ప్రవర్తించారు… ?
శాంతి, భద్రతల విషయంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులతో ఎలా ప్రవర్తించారో తెలియజేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం శాసన సభ్యులకు ప్రశ్నావళిలో హుకుం జారీ చేసింది. కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర ఎంతో ఉందని, అలాంటి సమయంలో వారికి మీరు ఎలా సాయపడ్డారో తెలియజేయాలని ఆదేశించింది. శాసన సభ వర్షకాల సమావేశాల సమయంలో ఈ ప్రశ్నావళికి సమాధానలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ విధించింది.











