Radhe Shyam Teaser Sets New Record In Tollywood Industry
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ భారీ పిరియాడిక్ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇందులో విక్రమాదిత్య ఎలా వుండబోతున్నాడు..? ఏం చేయబోతున్నాడు?. విక్రమాదిత్య ఎవరు..? అనే ప్రశ్నలకి సమాధానంగా ప్రభాస్ పుట్టినరోజున క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు.
ఇందులో ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీ లో జరిగే ప్రేమకథగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడిని కాదు కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ ప్రపంచ వ్యాప్తంగా వున్న సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
Radhe Shyam Teaser Sets New Record In Tollywood Industry
భారీ అంచనాలతో రిలీజ్ అయిన రాధేశ్యామ్ టీజర్ సోషల్ మీడియాలో మెరుపు వేగంతో దూసుకెళుతుంది. ఇలా రిలీజ్ చేశారో లేదో అలా యుట్యూబ్ ని షేక్ చేసింది. డిజిటల్ మాధ్యమాల్లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ టీజర్ బిగ్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ప్రస్తుతం 62 మిలియన్ వ్యూస్ తో రాధేశ్యామ్ టీజర్ దూసుకెళుతుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఇదే హాయ్యెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్. ఈ విధంగా సరికొత్త రికార్డ్ చేసింది. ముందు ముందు ఇంకెన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి.