రాజద్రోహం కేసులో అరెస్టయిన నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.మిలటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రఘురామరాజు ఢిల్లీకి వెళ్లారు.ఆయన మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.ఏపీ సీఐడి అరెస్టు చేసిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కోర్టు ఆదేశాలు, నిబంధనలు పూర్తి చేసిన రఘురామరాజు లాయర్లు మిలటరీ ఆసుపత్రికి చేరుకుని ఎంపీని డిశ్చార్జ్ చేయించారు. ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో రఘురామరాజును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు డాక్టర్లు అంగీకరించారు.
కాకినాడ పోర్టు సాక్షిగా జగన్‌కి విజయసాయి వెన్నుపోటు..??
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి......